Site icon NTV Telugu

Ramabanam: మాస్ బీట్ తో ప్రమోషన్స్ పల్స్ పెంచారు…

Ramabanam

Ramabanam

మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామబాణం’. నందమూరి నట సింహం బాలకృష్ణ ఫిక్స్ చేసిన ఈ టైటిల్ తో గోపీచంద్ కంబ్యాక్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. గోపీచంద్ కి ఇప్పటికే రెండు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ ఈ రామబాణం సినిమాతో హ్యాట్రిక్ హిట్ ఇస్తాడని గోపీచంద్ ఫాన్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న రామబాణం సినిమాలో గోపీచంద్ కి అన్నగా జగపతి బాబు నటిస్తున్నాడు. ఈ ఇద్దరూ అన్నదమ్ములుగా నటించిన లక్ష్యం సినిమా మంచి హిట్ గా నిలిచింది. రామబాణం సినిమా నుంచి ఇప్పటివరకూ బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే గోపీచంద్, జగపతి బాబు రియల్ లైఫ్ బ్రదర్స్ అనిపించేలా ఉన్నారు. లేటెస్ట్ గా రామబాణం సినిమా నుంచి ‘ధరువేయ్ రా’ సాంగ్ రిలీజ్ అయ్యింది.

టెంపుల్ డ్రాప్ లో డిజైన్ చేసిన ఈ సాంగ్ లో గోపీచంద్ పంచెకట్టులో మస్త్ ఉన్నాడు. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్, మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ట్యూన్, కృష్ణ తేజస్వి-చైత్ర వోకల్స్ ‘ధరువేయ్ రా’ సాంగ్ ని రామబాణం సినిమా ప్రమోషన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ఇంతక ముందు రిలీజ్ అయిన ఐఫోన్ సాంగ్ యూత్ ని అట్రాక్ట్ చేసేలా ఉంటే ఈ ధరువేయ్ సాంగ్ ఫ్యామిలీ అండ్ మాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేలా ఉంది. హీరో గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయతి డాన్స్ మూవ్స్ తో ఆడియన్స్ ని మెప్పించేలా ఉన్నారు. మరి ధరువేయ్ సాంగ్ ఇచ్చిన కిక్ తో ప్రమోషన్స్ లో కాస్త స్పీడ్ పెంచి, మే 5న గోపీచంద్ మంచి హిట్ కోడతాడేమో చూడాలి.

Exit mobile version