ధనుష్ హీరోగా నటించిన, విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ చిత్రం ‘కర్ణన్’. ఈ ఏడాది ఏప్రిల్ 9న రిలీజ్ అయిన ఈ చిత్రంపై ప్రశంసలు ఇంకా ఆగట్లేదు. అలాగే అవార్డులు కూడా రావడం ఆగడం లేదు. ఇప్పటికే పలు అవార్డులను అందుకున్న “కర్ణన్” చిత్రం తాజాగా బెంగుళూరులో జరిగిన ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ భారతీయ చిత్ర అవార్డును గెలుచుకుంది. ఇది నాలుగో ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎడిషన్. ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నాల్గవ ఎడిషన్ ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీని (IFA) ద్వారా 2015 లో ఇన్నోవేటివ్ గ్రూప్ ఏర్పాటు చేసింది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ అక్టోబర్ 15 న ప్రారంభమై అక్టోబర్ 17 న ముగిసింది. ఈ ఈవెంట్ సందర్భంగా 9 స్క్రీన్‌లపై 30కి పైగా భాషల్లోని 20 దేశాల నుంచి 100కి పైగా సినిమాలు ప్రదర్శితమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రదర్శించబడిన చిత్రాలలో రెండు తమిళ చిత్రాలు కర్ణన్, కటిల్ స్థానం సంపాదించుకున్నాయి.
Read Also : మూడు యూట్యూబ్ ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా
మే 14న ఓటిటి ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమైన ఈ సినిమా కథ తమిళనాడులోని ఒక చిన్న గ్రామం చుట్టూ తిరుగుతుంది. గ్రామంలో తక్కువ కులానికి చెందిన ప్రజలు నివసిస్తుంటారు. ఈ చిత్రం పొడియంకుళం అనే చిన్న గ్రామంలో పోలీసుల క్రూరత్వ బాధితుల కథను చూపించారు. వారి పట్ల అమానవీయంగా వ్యవహరించిన తీరుపై కర్ణన్ తిరుగుబాటు చేయడం, కర్ణన్ గగ్రామస్తుల హక్కుల కోసం పోరాడటాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు.
