Site icon NTV Telugu

ధనుష్- ఐశ్వర్య మళ్లీ కలుస్తారు.. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాం- హీరో ధనుష్ తండ్రి

dhanush

dhanush

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్- ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వివాహబంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక తాజాగా వీరి విడాకులపై హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు. కొడుకు విడాకులపై మీ స్పందన ఏంటి అని అడుగగా వారిద్దరూ త్వరలోనే కలుస్తారు అని చెప్పి షాక్ ఇచ్చారు. మీడియా తో ఆయన మాట్లాడుతూ “ధనుష్- ఐశ్వర్య మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అందుకే వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వారిద్దరూ ప్రస్తుతం చెన్నైలో లేరు.. నేను ఈ విషయమై వారితో ఫోన్ లో మాట్లాడాను.. నాతో పాటు ఐశ్వర్య తండ్రి రజినీకాంత్ కూడా విడాకుల విషయమై మరోసారి ఆలోచించాలి అని చెప్పారు. త్వరలోనే వాళ్లు మళ్లీ కలుస్తారు” అని చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి అభిమానుల్లో ఆశ చెలరేగింది. ధనుష్- ఐశ్వర్య మళ్లీ కలవాలని కోరుకుంటున్నట్లు ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version