Site icon NTV Telugu

DS 2 : శేఖర్ కమ్ములతో ధనుష్ మరో సినిమా

Dhanush Shekar

Dhanush Shekar

తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున, మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల అంటే కచ్చితంగా బలమైన కథ, కథనం ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు. కమ్ముల టేకింగ్ కు ధనుష్ నటన తోడైతే ప్రేక్షకులకు విజువల్ ట్రేట్ అనే చెప్పాలి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరెకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆసియాన్ సినిమాస్ బ్యానర్ పై ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు.

Also Read : Vaani Kapoor : వరుస ప్లాపులతో వెనకబడిన వాణి

ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నకుబేర  జూన్ 20న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే దర్శకుడు శేఖర్ కమ్ములతో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు ధనుష్. అవును కుబేర షూటింగ్ టైమ్ లో ధనుష్ కు డైరెక్టర్ శేఖర్ కమ్ములకు మరో కథ వినిపించగా అందుకు ఈ తమిళ్ స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కుబేర సినిమాను నిర్మిస్తున్న ఏషియన్ సినిమాస్ బ్యానర్ లో శేఖర్, ధనుష్ సినిమాను నిర్మిస్తోంది. ఏదేమైనా చేస్తున్న సినిమా రిలీజ్ కాకాకుండానే మరో సినిమా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే అది శేఖర్ కమ్ముల వర్క్ అంటే అని టాలీవుడ్ సిర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Exit mobile version