NTV Telugu Site icon

Dhanush: ‘మాస్ట్రో ఇళయరాజా’గా ధనుష్?

Dhanush Ilayaraja

Dhanush Ilayaraja

Dhanush to act in Maestro Ilaiyaraaja’s Biopic: ఇప్పటికే అనేక బయోపిక్ సినిమాల గురించి చర్చ జరుగుతుండగా ఇప్పుడు మరో బయోపిక్ కూడా అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. అదేమంటే మాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌కి ధనుష్ సైన్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ వార్త చాలా కాలంగా కోలీవుడ్ ఇన్‌సైడ్ సర్కిల్స్‌ చర్చలలో ఉంది. అయితే ఈ సినిమా విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇసైజ్ఞాని బయోపిక్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని అంటున్నారు. మాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌కి ధనుష్ సైన్ చేయడంతో తమిళ సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నివేదికల ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ 2024లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

OTT: తెలుగు నిర్మాతలకు నిద్రలేకుండా చేస్తున్న OTT ప్లాట్‌ఫారమ్‌లు!

ప్రస్తుతం మోహన్‌లాల్ యొక్క వృషభ చిత్రాన్ని నిర్మిస్తున్న Connekkt Media బ్యానర్ ఈ కొత్త సినిమాను నిర్మిస్తుంది. గతంలో ‘షమితాబ్’ సినిమాకి ధనుష్‌తో కలిసి పనిచేసిన బాలీవుడ్ చిత్రనిర్మాత ఆర్ బాల్కీ, ఇటీవల ధనుష్ ప్రధాన పాత్రలో లెజెండరీ స్వరకర్త ఇసైగ్నియాని ఇళయరాజాపై బయోపిక్ రూపొందించాలని తన కోరికను వ్యక్తం చేశారు. బాల్కీ గతంలో ఇళయరాజాతో కలిసి పనిచేశారు. దర్శకుడు ఆర్ బాల్కీ ఈ గ్రాండ్ బయోపిక్ తీస్తానని ఆఫ్ ది రికార్డ్ చెప్పినా, ఇళయరాజా బయోపిక్ దర్శకుడి గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ప్రియాంక మోహన్, శివ రాజ్‌కుమార్‌లు జంటగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.