NTV Telugu Site icon

Dhanush : ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ టైటిల్ తో ధనుష్

Dhanush

Dhanush

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గతేడాది నటించిన కెప్టెన్ మిల్లర్ కాస్త నిరాశపరిచింది. కానీ ధనుష్ స్వయంగా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’ సూపర్ హిట్ సాధించింది. అంతే కాదు ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సాధించింది. రాయన్ సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న ధనుష్ హీరోగా కంటే కూడా దర్శకుడిగానే ఎక్కువ ఫోకస్ చేస్తునట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే తన డైరెక్షన్ లో వరుస సినిమాలు ప్రకటించాడు ధనుష్.

ధనుష్ మేనల్లుడు పవీష్‌ను కోలీవుడ్ లో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ రూపొందిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ‘నిలవుక్కు ఎన్మేల్ ఎన్నాడీ కోబం’. ఈ సినిమాకు దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు ధనుష్. ఈ సినిమాను తెలుగులోనూ తీసుకువస్తున్నాడు ధనుష్. అయితే తెలుగులో ఈ NEEK సినిమాకు ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసాడు ధనుష్. సాఫ్ట్ టైటిల్ తో తెలుగులో ఈ సినిమాపై క్రేజ్ ను పెంచేసాడు ధనుష్. తమిళ్ స్టార్ సంగీత దర్శకుడు G.V ప్రకాష్ మ్యూజిక్  అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 21 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. మొదటి సినిమాతో రివెంజ్ డ్రామా కథ నేపధ్యాన్ని ఎంచుకున్న ధనుష్ ఈ  దఫా సున్నితమైన ప్రేమ కథాంశాన్ని ఎంచుకున్నాడు. మరి జాబిలమ్మ నీకు అంత కోపమా తో హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.