Site icon NTV Telugu

Sir: అన్ని ప్రీమియర్ షోస్ హౌజ్ ఫుల్… ధనుష్ కి ఇది బెస్ట్ లాంచ్

Sir

Sir

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే కోలీవుడ్ హీరో ధనుష్ మాత్రం పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ రియల్ పాన్ ఇండియా హీరో అనిపించుకుంటున్నాడు. హాలీవుడ్ లో గ్రే మ్యాన్ చేసిన ధనుష్, ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగాడు. ప్రతి చోట స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్న ధనుష్, తెలుగులో ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాలతోనే ప్రేక్షకులని పలకరించాడు. ఈసారి మాత్రం ధనుష్ తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా ‘వాతి/సార్’ సినిమా చేస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా, జీవీ ప్రకాష్ మ్యూజిక్ తో వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సితార ఎంటర్తైన్మెంట్స్ నిర్మిస్తున్న ‘సార్’ సినిమా ప్రమోషనల్ కంటెంట్ తోనే హిట్ అనే నమ్మకాన్ని తమిళ, తెలుగు ప్రేక్షకులకి కలిగించింది.

Read Also: Dhanush: ఈ హీరోని చూసి తమిళ హీరోలు చాలా నేర్చుకోవాలి…

ప్రస్తుతం స్కై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సార్ సినిమా రేపు సాలిడ్ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలోని అన్ని ముఖ్యమైన సెంటర్స్ లో సార్ సినిమాకి ప్రిమియర్స్ వేశారు. అనౌన్స్ చేసిన వెంటనే టికెట్స్ హాట్ కేకుల్లా బుక్ అయిపోవడంతో, సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు సార్ ప్రీమియర్స్ షోస్ కి థియేటర్స్ పెంచే పనిలో పడ్డారు. ఇప్పటివరకూ 35 షోస్ హౌజ్ ఫుల్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ ప్రీమియర్స్ నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం, ధనుష్ తెలుగులో సాలిడ్ డెబ్యు కొట్టేసాడని సమాచారం. రేపు మార్నింగ్ షోకి కూడా ఇదే టాక్ ని రాబట్టగలిగితే సార్ సినిమా ధనుష్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ గా నిలుస్తుంది. దీంతో పాటు తెలుగులో మొదటి సినిమాతోనే సాలిడ్ డెబ్యు ఇచ్చిన హీరోగా ధనుష్ నిలబడిపోతాడు.

Read Also: Sir/Vaathi: ధనుష్ సినిమా కోసం 7 స్క్రీన్ తో కలిసిన సితార…

Exit mobile version