NTV Telugu Site icon

Dhanush 51: ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో పాన్ ఇండియా #D51

D 51 Poster

D 51 Poster

Dhanush #D51 Announced: ధనుష్ 51వ సినిమాను లెజండరీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ శ్రీ నారాయణ్ దాస్ కే నారంగ్ జయంతి సందర్భంగా అధికారికంగా అనౌన్స్ చేశారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ నటించనుండగా టాలీవుడ్ మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్-విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయనున్నారు. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ క్రేజీ మూవీ #D51ని నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీర్వాదంతో నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ వారి నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియాన్ గ్రూప్)లో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి మల్టీ లాంగ్వేజస్(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ)లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారు.

Vijayasai Reddy: హీరోల కొడుకులే హీరోలా.. వాళ్ళకి ఎందుకంత రెమ్యునరేషన్?

ఇక ఈ #D51 సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇక ధనుష్ పుట్టిన రోజు జూలై 28న మేకర్స్ #D51 కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇంతకు ముందెన్నడూ చూడని అవతార్‌లో ధనుష్‌ని చూపించే పర్ఫెక్ట్ కథను శేఖర్ కమ్ముల సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా గురించి ఇతర వివరాలు ఏఈ వెల్లడించలేదు కానీ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారని తెలుస్తోంది. ఇక ఈమేరకు ఒక పోస్టర్ రిలీజ్ చేయగా ఆ పోస్టర్ లో ఒక పక్క స్లం కనిపిస్తోంది, మధ్యలో డబ్బు నోట్లు ఉండగా ఆపక్కనే బహుళ అంతస్తుల భవనాలు కనిపిస్తున్నాయి.