Site icon NTV Telugu

Geetha Arts : గీతాఆర్ట్స్ తో ‘నేనే వస్తున్నా’ అంటున్న ధనుష్

Geetha Arts

Geetha Arts

ధనుష్‌ హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో కలైపులి ధాను నిర్మిస్తున్న ‘నానే వరువేన్’ సినిమా ఈ నెల 29 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తమిళంలో వి క్రియేషన్స్ పతాకంపై నిర్మితం అవుతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సొంతం చేసుకన్నారు. ఈ మేరకు ధాను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెలుగు సినిమా టైటిల్ ను ‘నేనే వస్తున్నా’గా ఫిక్స్ చేసినట్లు రివీల్ చేశారు. ధనుష్ తో ఇల్లి ఆవ్రామ్ నటించిన ఈ సినిమాలో సెల్వరాఘవన్, ప్రభు, ఇందుజ రవిచంద్రన్, యోగిబాబు, షెల్లీ కిషోర్ ఇతర ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇందులో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. 11 సంవత్సరాల తర్వాత ధనుష్‌, సెల్వరాఘవన్ కలసి చేస్తున్న సినిమా ఇది. దీనికి ధనుష్ కథను అందించటం విశేషం.

Exit mobile version