Site icon NTV Telugu

Dhanush: ‘కర్ణన్’ కాంబినేషన్ రిపీట్… ధనుష్ నుంచి సర్పైజ్ అనౌన్స్మెంట్

Dhanush

Dhanush

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇతర ఇండస్ట్రీల్లో కూడా సినిమాలు చేస్తూ మార్కెట్ ని పెంచుకుంటూ ఉన్నాడు. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ధనుష్ ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ డ్రామాపై భారి అంచనాలు ఉన్నాయి. కెప్టైన్ మిల్లర్ అయిపోగానే ధనుష్ కి హిందీలో ఆనంద్ రాయ్ తో ఒక మూవీ కమిట్మెంట్ ఉంది. తెలుగులో శేఖర్ సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు, యుగానికి ఒకడు మూవీ సీక్వెల్ కి కూడా ధనుష్ ఓకే చెప్పాడు. ఈ భారి ప్రాజెక్ట్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది.

ఈ ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ ల కన్నా ఎక్కువగా, కెప్టెన్ మిల్లర్ తర్వాత ఆ రేంజులో బజ్ జనరేట్ చేస్తూ ధనుష్, ఎవరూ ఊహించిన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ఆ అనౌన్స్మెంట్. ధనుష్ నటించిన కర్ణన్ సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయిన సంధర్భంగా సోషల్ మీడియా అంతా ‘కర్ణన్’ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న సమయంలో… కర్ణన్ మూవీని అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ ‘మారీ సెల్వరాజ్’తో ధనుష్ సినిమా అనౌన్స్ చేశాడు. తన సొంత నిర్మాత సంస్థ ‘ఉండర్ బార్ ఫిల్మ్స్’ బ్యానర్ పై ధనుష్ ఈ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు, జీ స్టూడియోస్ కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది.

Read Also: Kirankumar Reddy: ఏపీ, కర్నాటకల్లో ఇక యాక్టివ్ రోల్ .. ఆట ఎలా ఉంటుందో?

తమిళ సినీ అభిమానులకి ఇలాంటి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది అనే హింట్ కూడా లేదు అందుకే ధనుష్ నుంచి ట్వీట్ రాగానే అందరూ స్వీట్ షాక్ కి ఎక్స్పీరియన్స్ చేశారు. కర్ణన్ సినిమాని మారీ సెల్వరాజ్ అద్భుతంగా తెరకెక్కించాడు, అతను కథని చెప్పిన విధానం, తన ఐడియాని సినిమాటిక్ గా ప్రెజెంట్ చేసిన విధానం, కథనంలో మెటాఫర్స్ ని చూపించిన విధానం, రెవల్యూషన్ ని మ్యాటర్ ఆఫ్ యాక్ట్ గా కాకుండా అతను చేసిన విలేజ్ సెటప్ అండ్ విజువల్ డిజైన్ ఆడియన్స్ ని కట్టి పడేసింది. ఈ మూవీలో ధనుష్ యాక్టింగ్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. పరియేరుం పెరుమాళ్, కర్ణన్ లాంటి సినిమాలు తీసిన మారీ సెల్వరాజ్, టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవ్వడం బాగానే ఉంది కానీ అసలు ధనుష్ కి ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ ప్రకారం మారీ సెల్వరాజ్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే విషయంలోనే క్లారిటీ లేదు. మరి త్వరలో క్లారిటీ ఇస్తూ ధనుష్ నుంచి ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి.

Exit mobile version