OM Chapter 1: స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం చాప్టర్ 1’. సాయిపల్లవి పవర్ ఫుల్ సిబిఐ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌తో పాటు సౌత్ మొత్తం భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్ 20న సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతుండటంతో.. ప్రమోషన్ల జోరు పెంచేందుకు చిత్ర బృందం నవంబర్ 6న చెన్నై వేదికగా ఒక భారీ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
సినిమా రిలీజ్‌కు సరిగ్గా రెండు వారాల సమయం ఉండటంతో, బజ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాలని మేకర్స్ చూస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 6న నిర్వహించనున్న ఈ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వేడుకకు ధనుష్, సాయిపల్లవితో పాటు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తున్న మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, శ్రీలీల, దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లలో టీమ్ బిజీగా ఉందట.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘ఓం స్పెషల్ డ్యూటీ’ ట్రాక్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా నిత్యారెడ్డి అనే సిబిఐ ఆఫీర్ పాత్రలో సాయిపల్లవి ఖాకీ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ పాటకు వస్తున్న క్రేజ్ చూస్తుంటే ఆడియో లాంచ్‌తో సినిమాపై హైప్ మరింత రెట్టింపు కావడం ఖాయమనిపిస్తోంది. నిజానికి ఈ చిత్రాన్ని అక్టోబర్‌లోనే థియేటర్లలోకి తేవాలనుకున్నారు. కానీ రజనీకాంత్ ‘జైలర్ 2’తో క్లాష్ వద్దనుకుని రిలీజ్‌ను నవంబర్ 20కి మార్చారు. సేఫ్ డేట్ దొరకడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. దానికి తగ్గట్టే తమిళనాడు థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.30 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాయని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 6న జరగబోయే ఆడియో రిలీజ్ వేడుకతో ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లి, థియేటర్లలో భారీ ఓపెనింగ్స్ రాబట్టాలని చిత్ర యూనిట్ గట్టి పట్టుదలతో ఉంది.

