Dhanush – Mrunal Thakur: ఇన్నాళ్లూ సీక్రెట్‌గా లవ్.. ఇప్పుడు సైలెంట్‌గా విడిపోయారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush – Mrunal Thakur: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేమాయణం గురించి గత కొన్ని నెలలుగా సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ఒక షాకింగ్ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై ఇన్నాళ్లూ సాగిన ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ.. ఈ క్రేజీ జంట ఇప్పుడు బ్రేకప్ చెప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ధనుష్, మృణాల్ తమ ప్రేమకు ముగింపు పలకాలని డిసైడ్ అయ్యారట. ఈ ఇద్దరు స్టార్ట్స్ కూడా పరస్పర అంగీకారంతోనే ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాక్.
అయితే, ఈ ఇద్దరు స్టార్స్ విడిపోవడానికి గల అసలు కారణాలు ఏంటనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. అయితే అసలు వీరు ఎప్పుడు ప్రేమించుకున్నారు? అప్పుడే బ్రేకప్ ఎలా అయింది? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇరుపక్షాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదా వివరణ రాలేదు. నిజానికి మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ సినిమా ప్రీమియర్ షోకు ధనుష్ రావడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే చర్చ మొదలైంది. ఆ తర్వాత కూడా వీరిద్దరూ కలిసి పలుమార్లు పబ్లిక్‌గా కనిపించడంతో వీరి మధ్య లవ్ చిగురించినట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇటీవల వీరి పెళ్లికి సంబంధించిన ఏఐ ఫోటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతోంది. మరి ఈ రూమర్లపై ఈ స్టార్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?