Dhanush – Mrunal Thakur: ఇన్నాళ్లూ సీక్రెట్‌గా లవ్.. ఇప్పుడు సైలెంట్‌గా విడిపోయారా?

Dhanush, Mrunal Thaku

Dhanush, Mrunal Thaku

Dhanush – Mrunal Thakur: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేమాయణం గురించి గత కొన్ని నెలలుగా సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ఒక షాకింగ్ అప్‌డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై ఇన్నాళ్లూ సాగిన ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ.. ఈ క్రేజీ జంట ఇప్పుడు బ్రేకప్ చెప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ధనుష్, మృణాల్ తమ ప్రేమకు ముగింపు పలకాలని డిసైడ్ అయ్యారట. ఈ ఇద్దరు స్టార్ట్స్ కూడా పరస్పర అంగీకారంతోనే ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాక్.

అయితే, ఈ ఇద్దరు స్టార్స్ విడిపోవడానికి గల అసలు కారణాలు ఏంటనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. అయితే అసలు వీరు ఎప్పుడు ప్రేమించుకున్నారు? అప్పుడే బ్రేకప్ ఎలా అయింది? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇరుపక్షాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదా వివరణ రాలేదు. నిజానికి మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ సినిమా ప్రీమియర్ షోకు ధనుష్ రావడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే చర్చ మొదలైంది. ఆ తర్వాత కూడా వీరిద్దరూ కలిసి పలుమార్లు పబ్లిక్‌గా కనిపించడంతో వీరి మధ్య లవ్ చిగురించినట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇటీవల వీరి పెళ్లికి సంబంధించిన ఏఐ ఫోటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతోంది. మరి ఈ రూమర్లపై ఈ స్టార్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

×
×
Ad