NTV Telugu Site icon

Captain Miller: నువ్వు తోప్ యాక్టర్ అన్నా… ఎవరైనా కాదంటే ఈ ఒక్క ట్రైలర్ చూపిస్తా

Captain Miller

Captain Miller

ఈ జనరేషన్ టాప్ స్టార్ హీరోస్ లో బెస్ట్ యాక్టర్ ఎవరు అనే ప్రశ్న వేసి కొన్ని అషన్స్ ఇస్తే అందులో ధనుష్ కచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. ఇండియాస్ బెస్ట్ యాక్టర్ గా పేరు మాత్రమే కాదు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ ని కూడా గెలుచుకున్నాడు ధనుష్. సరైన పాత్ర ఇస్తే అద్భుతాలు చేయగలను అని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ చేసాడు ధనుష్. డైరెక్టర్ లో సత్తా ఉండాలి, దమ్ముండే కథ ఉండాలి కానీ ధనుష్ తెరపై విశ్వరూపమే చూపించగలడు. ఎప్పుడూ సినిమాల్లో నట విశ్వరూపాన్ని చూపించే ధనుష్ ఈసారి మాత్రం ట్రైలర్ తోనే తన పని మొదలుపెట్టాడు. ధనుష్, అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్ లో కెప్టెన్ మిల్లర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రైడ్ ఆఫ్ కోలీవుడ్ గా భారీ బడ్జట్ తో భారీ సెటప్ తో, హ్యూజ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ సినిమా ట్రైలర్ బయటకి వచ్చింది.

జీవీ ప్రకాష్ ఇచ్చిన ట్రెమండస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో, సిద్దార్థ్ నూని స్టన్నింగ్ విజువల్స్ తో కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ అదిరిపోయింది. ఈ రెండు ఎలిమెంట్స్ ట్రైలర్ లో స్టాండ్ అవుట్ అయ్యాయి. టెక్నీకల్ గా కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ టాప్ నాచ్ లో ఉంది. అరుణ్ మాతేశ్వరన్ సినిమాటిక్ పీక్స్ ని ట్రైలర్ తోనే చూపించాడు. పీరియాడిక్ డ్రామా సెటప్ అండ్ గెటప్స్ టూ గుడ్ ఉన్నాయి. ధనుష్ రెండు వేరియేషన్స్ ఉన్న లుక్ లో అదరగొట్టాడు. ముఖ్యంగా లాంగ్ హెయిర్ ఉన్న లుక్ లో అయితే ధనుష్ అద్భుతమే చేసి చూపించాడు. ట్రైలర్ లో సందీప్ కిషన్, శివన్న, ప్రియాంక మోహన్ లు కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపించారు.

Show comments