Dhanush: ‘రాయన్’ అవార్డుపై ధనుష్ స్పందన.. ‘మెయ్యళగన్’ మంచి సినిమానే, కానీ నా బాధ వేరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush: జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘రాయన్’ ఉత్తమ తమిళ చిత్రంగా ఎంపిక కావడంతో తమిళ సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా ‘మెయ్యళగన్’, ‘మహారాజా’ వంటి ప్రశంసలు అందుకున్న సినిమాలకు అవార్డు దక్కకపోవడంపై సినీ అభిమానులు, విమర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి స్పందించిన నటుడు ధనుష్ ఎంతో హుందాగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ అవార్డుపై వస్తున్న విమర్శలను తాను తప్పుగా భావించడం లేదని ధనుష్ చెప్పారు. ‘మెయ్యళగన్’, ‘మహారాజా’ వంటి చిత్రాలు కూడా జాతీయ అవార్డుకు పూర్తిగా అర్హమైనవేనని అంగీకరించారు. మంచి సినిమాలు ఎన్నో పోటీలో ఉన్నప్పుడు భిన్నమైన అభిప్రాయాలు రావడం సహజమని పేర్కొన్నారు.
అయితే తన కెరీర్‌ను గుర్తు చేసుకున్న ధనుష్, ‘పుదుపేట్టై’, ‘మర్యాన్’, ‘కర్ణన్’, ‘రాంఝానా’, ‘వడ చెన్నై’ వంటి తన కెరీర్లో అత్యంత ప్రశంసలు అందుకున్న సినిమాలకు జాతీయ అవార్డు గుర్తింపు రాలేదని గుర్తుచేశారు. ఆ సమయంలో వాటి కోసం పెద్దగా ఎవరూ మాట్లాడలేదని, ఇప్పుడు మాత్రం ఒక్క అవార్డు విషయంలో పెద్ద చర్చ జరగడం తనకు ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పారు. సినిమా విలువను కేవలం అవార్డులతో మాత్రమే కొలవలేమని ధనుష్ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకుల ప్రేమ, చిరస్థాయిగా నిలిచిపోయే గుర్తింపే ఒక సినిమాకి అసలైన విజయమని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Bhagyashri Borse: ఆ సూపర్ స్టార్‌తో డిన్నర్ డేట్ చేయాలని ఉంది.. మనసులో మాట చెప్పిన 'లెనిన్' హీరోయిన్
- NTR Dragon: యూరప్‌లో కాదు.. ఆర్ఎఫ్సిలో యాక్షన్ రచ్చ! ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం భారీ సెట్
- The Paradise: 20 కోట్ల వ్యూస్‌తో దుమ్మురేపిన 'ఆయా షేర్'.. 'ది ప్యారడైజ్' రిలీజ్ డేట్‌పై బిగ్ అప్డేట్!
- Ram Charan: రామ్ చరణ్‌కు గాయం.. సర్జరీ కోసం కోయంబత్తూరు, RC17పై ప్రభావం?
ఈ సందర్భంగా నటుడు అజిత్ కుమార్ చెప్పిన ‘మీరు మీ ఓటమిని అంగీకరించే వరకు మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు’ అనే మాటలను గుర్తు చేస్తూ, అదే తన జీవితంలో కూడా నమ్మే సిద్ధాంతమని వెల్లడించారు. చివరగా ఒక అవార్డు చుట్టూ జరిగే వివాదాల కంటే తమిళ సినిమా సాధించిన విజయాలను అందరూ కలిసి సెలబ్రేట్ చేయాలని ధనుష్ పిలుపునిచ్చారు. విభేదాలను పెంచడం కంటే మంచి సినిమాలను ప్రోత్సహించడం, కళాకారుల కృషిని గౌరవించడం ముఖ్యమని ఆయన సందేశం ఇచ్చారు. ధనుష్ చేసిన ఈ హుందా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
తాజావార్తలు
-
Dhanush: ‘రాయన్’ అవార్డుపై ధనుష్ స్పందన.. ‘మెయ్యళగన్’ మంచి సినిమానే, కానీ నా బాధ వేరే!
-
Arshdeep Singh: మై పర్సన్.. ప్రేమను అధికారికంగా ప్రకటించిన అర్ష్‌దీప్ సింగ్.. సమ్రీన్ కౌర్ ఎవరు?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rishikanta Singh Chanambam: రోజుకు రూ.200 కూలీ నుంచి కామన్వెల్త్ గేమ్స్ రజత పతకం వరకు.. రిషికాంత సింగ్ ప్రయాణం ఇలా.!
-
Bhagyashri Borse: ఆ సూపర్ స్టార్‌తో డిన్నర్ డేట్ చేయాలని ఉంది.. మనసులో మాట చెప్పిన ‘లెనిన్’ హీరోయిన్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!