Aishwarya – Dhanush: అవన్నీ ఫేక్ వార్తలే.. కలవట్లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush And Aishwaryaa Not Patching Up: తొమ్మిది నెలల నుంచి దూరంగా ఉంటోన్న ధనుష్, ఐశ్వర్య.. మళ్లీ తిరిగి కలవబోతున్నారని, తమ విడాకుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని ఓ వార్త ఇటీవల తెగ చక్కర్లు కొట్టింది. ఈ వార్తల్ని ఎవ్వరూ ఖండించకపోవడంతో.. ఇది దాదాపు నిజమేనని అంతా అనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేలింది. ఒక్కటవ్వడం కాదు కదా, కనీసం మాట్లాడుకోవడానికి కూడా ఈ ఇద్దరు ఇష్టపడట్లేదని తెలిసింది.
రీ-యూనియన్ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. ఒక ప్రముఖ మీడియా సంస్థ ధనుష్ సన్నిహిత వర్గాల్ని సంప్రదించింది. ‘ధనుష్, ఐశ్వర్య ఒక్కటవుతున్నారని వార్తలు వస్తున్నాయి.. ఇది నిజమేనా?’ అని ప్రశ్నించింది. అందుకు వాళ్లు బదులిస్తూ.. ఆ వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఒక్కటవ్వడం కాదు కదా, ఒకరినొకరి మధ్య సాధారణ పలకరింపులు కూడా లేవని అన్నారు. కేవలం తమ పిల్లలకు సంబంధించిన బాధ్యతలు చూసుకుంటున్నారే తప్ప, అంతకుమించి ఆ ఇద్దరి మధ్య పెద్దగా బాండింగ్ లేదని చెప్తున్నారు. బహుశా పిల్లల విషయంలో కలిసినప్పుడు, ఈ వార్తలు పుట్టుకొచ్చి ఉంటాయని.. వాళ్లిద్దరు కలవనున్నారన్న వార్తల్లో మాత్రం నిజం లేదని వెల్లడించారు. ఇది ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశపరిచే చేదువార్తే!
Also Read
కాగా.. ధనుష్, ఐశ్వర్య 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరి 18 ఏళ్ల దాంపత్య జీవితంలో ఏనాడూ విభేదాలు నెలకొనలేదు. అన్యోన్యంగా ఉంటూ.. ఇతర జంటలకు ఆదర్శంగా నిలిచారు. అయితే.. వీరికి ఎవరి దిష్టి తగిలిందో, వీరి మధ్య ఎలాంటి సమస్యలు తలెత్తాయో తెలీదు కానీ.. ఉన్నట్టుండి విడిపోతున్నామంటూ బాంబ్ పేల్చారు.
తాజావార్తలు
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!