ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో విడాకుల సీజన్ నడుస్తోంది. గత కొంతకాలం నుంచి సెలెబ్రిటీ కపుల్స్ కొంతమంది వరుసగా తమ విడాకులు ప్రకటిస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఈ లిస్ట్ లో తాజాగా ధనుష్ జంట చేరిన విషయం తెల్సిందే. ఒక వారం క్రితం ధనుష్, ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ 18 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత విడిపోతున్నామంటూ ప్రకటించారు. ఈ వార్త వారి అభిమానులకు, శ్రేయోభిలాషులకు దిగ్భ్రాంతిని కలిగించింది. ఇక ధనుష్ నుండి విడిపోయిన తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ కూడా వెంటనే పనిలో చేరి నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.
Read Also : ధనుష్ “సార్” నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్
ఆమె ప్రస్తుతం బే ఫిల్మ్స్ నిర్మించిన తన రాబోయే మ్యూజిక్ వీడియో ప్రీ-ప్రొడక్షన్‌లో బిజీగా ఉంది. మేకర్స్ సెట్స్ లో ఐశ్వర్య ఒక టీమ్‌తో పని గురించి చర్చిస్తూ బిజీగా ఉన్న పిక్ ను పంచుకున్నారు. ప్రేమికుల రోజున విడుదల కానున్న తన కొత్త పాట కోసం సిద్ధమైంది. అంతేకాదు ఐశ్వర్య ఒక సాలిడ్ ప్రాజెక్ట్ కోసం హిందీ మ్యూజిక్ లేబుల్ టిప్స్‌తో జతకట్టింది. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టుకు ఐశ్వర్యనే దర్శకత్వం వహించనుందన్న మాట. ఇక ఆమె ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉంది. ధనుష్ కూడా తన ‘సార్’ సినిమా షూటింగ్ చేస్తూ ఇక్కడే ఉండగా… ఇద్దరూ ఒకే హోటల్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. రామోజీ రావు స్టూడియోలోని సితార హోటల్‌లో ఈ మాజీ జంట కనిపించారు.
కాగా ఐశ్వర్య ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఇంటి పేరును ఇంకా మార్చుకోలేదు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో భర్త ఇంటి పేరును మార్చేసి విడాకుల గురించి ముందుగానే చెప్పకనే చెబుతున్నారు సెలెబ్రిటీలు. కాగా ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ హైదరాబాద్‌లో తమ తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఒకే హోటల్‌లో ఉన్నప్పటికీ తమ బిజీ షెడ్యూల్‌ల మధ్య మాజీ జంట ఒకరినొకరు కలుసుకున్నట్లు కన్పించడం లేదు.