Site icon NTV Telugu

Devil: డెవిల్ రిలీజ్ కి ముందు నవీన్ మేడారం బహిరంగ లేఖ.. అదేదీ నిజం కాదంటూ!

Devil Naveen Medaram

Devil Naveen Medaram

Devil Ex Director Naveen Medaram Releases a Press Note on Devil Movie: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమాకి ముందు నవీన్ మేడారంను డైరెక్టర్ అని అనౌన్స్ చేశారు. అయితే తరువాత ఏమైందో ఏమో సినిమాని నిర్మాత అభిషేక్ నామా డైరెక్ట్ చేసినట్టు పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇక ఈ విషయం మీద ఇప్పటికే పలుమార్లు తన ఆవేదన ఇండైరెక్ట్ గా వ్యక్తం చేసిన నవీన్ మేడారం ఇప్పుడు ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. ‘డెవిల్’ సినిమాకు ప్రాణం పోసేందుకు మూడేళ్లు అలుపెరగకూడా పని చేశా, స్క్రిప్ట్‌ని కాన్సెప్ట్ గా మలచడం, స్క్రీన్‌ప్లే డెవలప్ చేయడం, కాస్ట్యూమ్స్ నుండి ఫ్యాబ్రిక్స్ వరకు చాలా జాగ్రత్తగా ఎంచుకోవడం, సెట్‌ల రూపకల్పన మొదలు లొకేషన్‌ల దాకా సినిమాలోని ప్రతి అంశం నా కళాత్మక దృష్టి పెట్టడంతో నా వ్యక్తిగత టచ్‌ను కలిగి ఉంటుంది. ‘డెవిల్‌’ని నేను స్వంతంగా రూపొందించి, కారైకుడి, వైజాగ్‌, హైదరాబాద్‌ వంటి లొకేషన్‌లలో (కొన్ని రోజుల ప్యాచ్‌ వర్క్‌ మినహా) 105 రోజుల పాటు సినిమాని షూట్ చేశా, నాకు ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, నా బిడ్డ లాంటిది. ఎవరు ఏం చెప్పినా ఇది నవీన్ మేడారం సినిమా అని ఆయన రాసుకొచ్చాడు.

Prabhas: రికార్డులు క్రియేట్ చెయ్యడమే హాబీగా పెట్టుకున్నాడు

నేను నిశ్చింతగా నా పని నేను చేసుకుంటూనే ఉన్నా నా మౌనాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ఈ సినిమా నిర్మాణంలో నేను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ రోజు మనం ఎదుర్కొంటున్న ఈ వివాదం స్వచ్ఛమైన అహం, దురాశతో ఏర్పడిన కొన్ని అజాగ్రత్తతో కూడిన నిర్ణయాల ఫలితమే. వార్తల్లో వస్తున్నట్టు నేను ఏ వ్యక్తిపై లేదా సినిమాపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదని అన్నారు. నా స్వంత సినిమాలో నాకు దర్శకత్వం వహించిన క్రెడిట్ ఇవ్వక పోవడంతో నేను తీవ్ర నిరుత్సాహానికి లోనైనప్పటికీ, అమూల్యమైన అనుభవం, నైపుణ్యం మరియు నా విశ్వాసాన్ని నిలుపుకున్నాను. నేను నా కెరీర్‌లో ఎప్పుడూ ఏకాగ్రతతో, పట్టుదలతో ఉంటా, మరింత బలంగా తిరిగి రావాలని నేను నిశ్చయించుకున్నాను. కళ్యాణ్‌రామ్ సార్ తన 100% ఈ సినిమా కోసం పెట్టారు. ఈ ప్రయత్నంలో నాకు మద్దతు ఇచ్చిన కళ్యాణ్‌రామ్ సార్‌కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ‘డెవిల్’ బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు నమ్మకం ఉంది, డిసెంబర్ 29, 2023న ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడవలసిందిగా అందరినీ కోరుతున్నా, నేను ఒక కొత్త సినిమాకి సంతకం చేశా, స్క్రిప్ట్‌పై పని చేస్తున్నాను, త్వరలో వివరాలను ప్రకటిస్తాను ధన్యవాదాలు అంటూ ఆయన పేర్కొన్నారు. మరి అభిషేక్ ఆర్ట్స్ నుంచి ఎలాంటి సమాధానం రాబోతుంది అనేది చూడాల్సి ఉంది.

Exit mobile version