Devi Sri Prasad : దేవి శ్రీ ప్రసాద్ మీద ఈ నడుమ ట్రోల్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఆయన కొత్త పాట ఏది వచ్చినా సరే.. అది పలానా పాటదే అంటూ సదరు సాంగ్స్ ను ప్లే చేసి మరీ పోస్టులు పెడుతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మాత్రం ఇలాంటి వాటిని ఎన్నడూ పట్టించుకోలేదు. అయితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ట్రోల్స్ మీద స్పందించారు. “నేను కెరీర్ లో ఎన్నడూ పాటలు కాపీ కొట్టలేదు. కానీ చాలా మంది నా పాటలను కాపీ కొడుతుంటారు. వాళ్లు నా దగ్గరకు వచ్చి మీ పాటలను చూసి ఇన్ స్పైర్ అయ్యాం సార్.. అందుకే వాటిని తీసుకున్నాం అని చెబుతారు’ అంటూ దేవి చెప్పుకొచ్చాడు.
Read Also : CM Revanth Reddy: కేసీఆర్ సభకు రండి.. మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత నాది
తాను ఎన్నడూ ట్రోల్స్ ను పట్టించుకోనని.. కెరీర్ లో ఎన్నో విజయాలు చూశానన్నారు. తన మీద నిర్మాతలు, దర్శకులకు, హీరోలకు మంచి నమ్మకం ఉందని.. ఒకవేళ కాపీ కొడితే ఇన్ని అవకాశాలు ఇవ్వరు కదా అంటూ నవ్వేశాడు. దేవి శ్రీ ప్రసాద్ కు ఈ నడుమ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు రావట్లేదనే వాదనలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా దేవికి తమన్ గట్టి పోటీగా మారాడని.. అటు తమిళ సంగీత దర్శకులు కూడా పోటీకి రావడంతో దేవికి ఇబ్బందులువస్తున్నాయని ఆయన ఫ్యాన్స్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ దేవి మాత్రం ఈ నడుమ మంచి హిట్లు కొడుతున్నాడు.
పుష్ప-2తో పాటలు మంచి హిట్ అందుకున్నాయి. మొన్న వచ్చిన తండేల్ సాంగ్స్ కూడా భారీ హిట్ అయ్యాయి. దేవి మళ్లీ పాత రోజుల్లో మాదిరిగా పెద్ద సినిమాలు చేయాలని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.