Devendra Fadnavis Croons Pushpa Song Srivalli With Javed Ali At Mumbai Event: అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా ‘పుష్ప ది రైజ్’ ఫీవర్ విడుదలై ఏళ్ళు గడుస్తున్నా అభిమానుల్లో తగ్గడం లేదు. ఇప్పటి వరకూ ఈ సినిమాపై ప్రజల్లో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను మరింత పెంచేలా చూసి త్వరలో ఈ చిత్రానికి రెండో భాగాన్ని తీసుకురాబోతున్నారు పుష్ప టీమ్. తాజాగా సుకుమార్ పుష్ప్ 2: ది రూల్ పోస్టర్‌ను విడుదల చేసి అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచాడు. ఇదిలా ఉంటే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పుష్ప పాడిన ఫేమస్ సాంగ్ ‘శ్రీవల్లి’ పాడి హాట్ టాపిక్ అయ్యారు. ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ‘శ్రీవల్లి’ పాట పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో, దేవేంద్ర ఫడ్నవిస్, గాయకుడు జావేద్ అలీతో కలిసి పుష్పా ది రైజ్‌లోని ‘శ్రీవల్లి’ పాటను పాడటం కనిపిస్తుంది.
Animal: బాలీవుడ్ కు ధమ్ మసాలా బిర్యానీ రుచి చూపించన్నా..
వాస్తవానికి, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు, అక్కడ ఆయన పుష్ప: ది రైజ్‌లోని ప్రసిద్ధ ‘శ్రీవల్లి’ సాంగ్ పాడుతూ కనిపించాడు. హిందీలో ‘శ్రీవల్లి’ పాటకు తన గాత్రాన్ని అందించిన గాయకుడు జావేద్ అలీ ఉప ముఖ్యమంత్రికి మైక్ ఇచ్చి తన అందమైన గొంతుతో పాటలోని కొన్ని లైన్లను పాడించారు. కొద్దిరోజుల క్రితమే విడుదలైన పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ సినిమా విడుదల కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2లో అల్లు అర్జున్, రష్మిక మందన్న మరియు ఫహద్ ఫాసిల్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న పుష్ప 2: ది రూల్ 15 ఆగస్టు 2024న విడుదల కానుంది.