నేషనల్ అవార్డ్ విన్నర్ సాయి రాజేష్ దర్శకత్వంలో, చిన్న రౌడీ ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘బేబీ’. వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన మ్యూజిక్ బేబీ సినిమాని ఆడియన్స్ లోకి తీసుకోని వెళ్తోంది. ఇప్పటికే బేబీ సినిమా నుంచి ‘ఓ రెండు మేఘాలిలా’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసి, బేబీ సినిమాకి హ్యూజ్ రీచ్ ని తెచ్చింది. లేటెస్ట్ గా బేబీ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘దేవరాజా’ అంటూ సాగే ఈ సాంగ్ తో ఆర్య ధాయల్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్ని స్టేజ్ షో పెర్ఫార్మెన్స్ లు ఇచ్చిన కేరళ సింగర్ ఆర్య ఆర్య ధాయల్ వాయిస్ ‘దేవరాజా’ సాంగ్ ని ప్రాణం పోసిందనే చెప్పాలి. ఫ్యూషన్ మిక్స్ తో క్యాచీ ట్యూన్ ని విజయ్ కంపోజ్ చేస్తే, కళ్యాణ్ రాసిన లిరిక్స్ దేవరాజా సాంగ్ ని ఒక మెట్టు ఎక్కిస్తే ఆర్య వాయిస్ మరో మెట్టు ఎక్కించింది.
ముఖ్యంగా సాంగ్ థర్డ్ మినిట్ ఎండ్ అయ్యి ఫోర్త్ మినిట్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి పీక్స్ చూపించారు. ఆ సౌండ్ రెండరింగ్ వింటే ఎవరైనా ట్రాన్స్ లోకి వెళ్ళిపోవాల్సిందే. ఒక విలేజ్ అమ్మాయి కాలేజ్ కోసం సిటీకి వస్తే, తన మెంటల్ స్టేటస్ ఏంటి అనేది దేవరాజా సాంగ్ లో చూపించారు. సాంగ్ మొత్తం వైష్ణవీ చైతన్య చుట్టే తిరిగింది, తను ఓవరాల్ గా రెండు లుక్స్ లో కనిపించింది. విలేజ్ లుక్ లో సాంగ్ మొత్తం కనిపించి, ఎండ్ లో మోడరన్ లుక్ లో వైష్ణవీ చైతన్య సిటీ లుక్ లోకి వచ్చేసింది. హ్యూజ్ వేరియేషన్స్ చూపించే అవకాశం దొరికింది కాబట్టి బేబీ మూవీ వైష్ణవీ చైతన్యకి హీరోయిన్ గా సాలిడ్ డెబ్యు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా బేబీ సినిమా నుంచి వస్తున్న ప్రతి పాట ఒక క్లాసిక్ లా నిలుస్తుంది. సినిమా కూడా ఇదే రేంజులో ఉంటే కాస్ట్ అండ్ క్రూకి సాలిడ్ హిట్ దొరికినట్లే.
https://twitter.com/sairazesh/status/1642869245754347520
