Site icon NTV Telugu

Devara: బిగ్ బ్రేకింగ్.. దేవర ఒకటి కాదు రెండు.. కన్ఫర్మ్

Ntr

Ntr

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. విలన్ గా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీఅజిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక మొదటి నుంచి ఈ సినిమా ఒక భాగం కాదు రెండు భాగాలుగా వస్తుందని వార్తలు వినిపించిన విషయం తెల్సిందే. అయితే.. ఈ వార్తపై మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోవడంతో అందరు లైట్ తీసుకున్నారు. కానీ, ఆ వార్త నిజం అని మేకర్స్ అధికారికంగా తెలిపారు. తాజాగా దేవర సినిమా గురించి డైరెక్టర్ శివ కొరటాల ఒక వీడియో ద్వారా మాట్లాడాడు. దేవర సినిమాను మొదట ఒక భాగంగానే ముగించాలని అనుకున్నాం.. కానీ, ఉన్నా కొద్దీ సినిమా నిడివి పెరిగింది.. దీంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనుకుంటున్నాం. సినిమా షేప్ మారకుండా కథను బట్టే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.

Laya: అచ్చ తెలుగు హీరోయిన్ లయ రీఎంట్రీ.. ఆ కుర్ర హీరో సినిమాలో..?

“పెద్ద సినిమా.. ఒక బిగ్ కాన్వాస్ లా ఉంటుంది. అంతేకాకుండా ఎంతోమంది స్టార్ క్యాస్టింగ్.. ఎంతో హై వోల్టేజ్ తో ఈ సినిమా మొదలుపెట్టాం.. ముందుకు వెళ్లేకొద్దీ ఇంకా ఇంకా పెరుగుతూ వచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఆ తరువాత మాకు, ఎడిటర్ కు ఒక డౌట్ వచ్చింది. సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది.. ఒక్క సీన్ ను కూడా కట్ చేయలేము.. ఒక డైలాగ్ కూడా తీయలేము అని ఫీల్ అయ్యి.. ఆదరాబాదరాగా అన్ని క్యారెక్టర్స్ ను ఒక పార్ట్ లో నే కుదించేయలేం.. ఇంత పెద్ద సినిమాను రెండు భాగాలుగా తీస్తే.. అందరి క్యారెక్టర్స్ ను చాలా డెప్త్ గా చెప్పాలని ఈ డెసిషన్ తీసుకున్నాం. దేవర రెండు భాగాలుగా వస్తుంది” అని తెలిపాడు. ప్రస్తుతం ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న ఈ సినిమా మొదటి భాగం రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version