NTV Telugu Site icon

ఈ వీకెండ్ ఓటీటీ లవర్స్ కి పండగే!

Ott Films

Ott Films

ఓటీటీలు ఈ వారం సాలిడ్ ప్రాజెక్ట్ లతో పండగ చేసుకోబోతున్నాయా..? అంటే అవుననే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కంటెంట్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. టాప్ హీరోల ఫ్యాన్స్ కు ఈ వీకెండ్ మాంచి ట్రీట్ దొరుకుతుంది.అందుల్లోను నందమూరి హీరోల ఫ్యాన్స్ కే కాదు దేవర సినిమాను థియేటర్లో చూడలేని వారికి…42 రోజుల తర్వాత ఓటీటీలో సినిమా ఛాన్స్ దొరికింది. కలెక్షన్స్ పరంగా 500 కోట్లు కొల్లగొట్టిన దేవర సినిమా ఈనెల 8న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ , జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన వేట్టయాన్‌ సినిమా తమిళనాట భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. తెలుగులో పెద్దగా వసూళ్లు రాబట్టలేక పోయినా ఓటీటీ ద్వారా చూడటం కోసం తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. సినిమా వచ్చిన 29రోజుల తర్వాత అనగా ఈనెల 8న అమెజాన్‌ ప్రైమ్‌ లో వేట్టయాన్‌ సినిమా స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది.

Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్

వేట్టయాన్ తెలుగు,తమిళ ఓటీటీ లవర్స్ కు మాంచి వీకెండ్ ను ఇచ్చినట్లయింది. సమంత నటించిన వెబ్‌ సిరీస్ ‘సిటాడెల్‌ : హనీ బనీ’.ఈ సిరీస్ ఎంటైర్ ఇండియన్ ఓటీటీ లవర్స్ ను ఎంతగానో వెయిట్ చేయిస్తుంది.నవంబర్‌ 7న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ లో… యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్‌ నమ్మకంగా చెబుతున్నారు. సమంత గతంలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2 వెబ్ సిరీస్‌ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే. అదే కాంబోలో సమంత చేసిన ఈ సిటాడెల్‌ కి మంచి ప్రీ రిలీజ్ బజ్‌ క్రియేట్‌ అయింది. దాదాపు ఏడాది కాలంగా ఈ వెబ్‌ సిరీస్‌ కోసం ప్రేక్షకులు వెయిట్‌ చేస్తున్నారు. ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాలు లేవని ఫీలయ్యే ప్రేక్షకులకు ఈ రెండు సినిమాలు సమంతా వెబ్ సిరీస్ మాంచి టైమ్ పాస్ గా మారబోతుంది.

Show comments