Site icon NTV Telugu

Devara: ఆ దేవరే ఫాస్ట్ అంటే ఈ దేవర మరింత ఫాస్ట్ గా ఉన్నాడే

Devara Shooting Update

Devara Shooting Update

Devara Movie Latest Schedule completed: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో హిట్ అందుకున్న తర్వాత దాదాపు ఏడాది గ్యాప్‌ తీసుకుని ఇటీవలే దేవర షూటింగ్ మొదలు పెట్టాడు జూనియర్ ఎన్టీఅర్. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ‘దేవర’.జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న దేవర సినిమాపై అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచుతూ కొరటాల శివ ఎప్పటికప్పుడు సినిమా నుంచి రకరకాల అప్డేట్స్ ఇస్తున్నారు. ఇక 2024లో రిలీజ్ అవ్వనున్న ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ తెరకెక్కుతోంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమా లేటెస్ట్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తుండగా ఆ షెడ్యుల్ కూడా పూర్తయింది.

Rangasthalam: జపాన్‌లో రామ్ చరణ్‌ ‘రంగస్థలం’కి దిమ్మతిరిగే కలెక్షన్లు.. మొదటి రోజే రికార్డులు తిరగరాస్తూ!

నిజానికి సినిమా మొత్తం మీద హైలైట్ గా చెప్పబడుతున్న ఈ సీక్వెన్స్ ను సైలంట్ గా షూట్ పొర్తి చేశారు. తాజాగా మేకర్స్‌ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే సైలెంట్ గా ఈ సినిమా షూట్ పూర్తి చేస్తూ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూట్ ను కూడా ఇలానే జెట్ స్పీడుతో పూర్తి చేస్తున్నారు మేకర్స్. సుజీత్ డైరెక్షన్లో డీవీవీ దానయ్య ఆ సినిమాను భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నారు. దీంతో ఆ దేవరే ఫాస్ట్ అంటే ఈ దేవర మరింత ఫాస్ట్ గా ఉన్నాడే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version