Site icon NTV Telugu

Devara: త్వరలో మరో పోరాటానికి సిద్ధం…

Devara

Devara

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో వార్ కి రెడీ అవుతున్నాడు… ఫిబ్రవరి 14 నుంచి దేవర నెక్స్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేయడానికి కొరటాల శివ అండ్ టీమ్ ప్రిపేర్ అవుతున్నారు. గత కొంతకాలంగా సైఫ్ అలీ ఖాన్ యాక్సిడెంట్ అయ్యి దేవర షూటింగ్ ఆగింది. ఎన్నికలు, సైఫ్ యాక్సిడెంట్ కారణంగా దేవర ఏప్రిల్ 5 నుంచి వెనక్కి వెళ్లింది. రిలీజ్ వాయిదా పడింది కాబట్టి ఇకపై దేవర షూటింగ్ లేట్ గా కంప్లీట్ చేస్తారు అనుకుంటే కొరటాల-ఎన్టీఆర్ లు సైఫ్ లేని పార్ట్ ని కంప్లీట్ చేయడానికి సిద్ధమయ్యారు. సెకండ్ హీరోయిన్ కూడా ఈ లేటెస్ట్ షెడ్యూల్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. దేవర క్యారెక్టర్, సెకండ్ హీరోయిన్, ఇతర కాస్ట్ ఈ షెడ్యూల్ లో జాయిన్ అవ్వనున్నారు.

Read Also: Aishwarya Rajinikanth :’కొలవెరి’ పాట వల్లే ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది..

నవంబర్ చివరి నాటికి లేదా డిసెంబర్ మిడ్ కి దేవర సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంది కానీ అనేక కారణాల వలన దేవర డిలే అవుతూనే ఉంది. ఈ డిలే కారణంగా దేవర రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యింది, వార్ 2 లేట్ అవుతుంది. దేవరలో తన పార్ట్ వరకూ కంప్లీట్ చేసైనా సరే వార్ 2 సెట్స్ లో జాయిన్ అవ్వడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు. దాదాపు మార్చ్ నెలలో ఎన్టీఆర్ వార్ 2 సెట్స్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. హ్రితిక్ రోషన్ కూడా వార్ 2 అనుకున్న దానికన్నా ముందే స్టార్ట్ అవుతుందని ఫైటర్ ప్రమోషన్స్ లో చెప్పాడు కాబట్టి మార్చ్ నుంచే వార్ 2 స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

Exit mobile version