Devara: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న దేవర మొదటి భాగం.. ఏప్రిల్ 5 న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పటినుంచో దేవర గ్లింప్స్ ఎప్పుడు వస్తుంది అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
దేవర అప్డేట్ ఇవ్వమని ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ కూడా చేశారు. ఇక ఇన్నాళ్ళకు మేకర్స్.. ఫ్యాన్స్ మొర విన్నారు. ఎట్టకేలకు దేవర గ్లింప్స్ కు డేట్ ఫిక్స్ చేశారు. జనవరి 8 న దేవర గ్లింప్స్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరో మూడు రోజుల్లో.. భయానికే దేవుడు రాబోతున్నాడు అంటూ రాసుకొచ్చారు. ఇక పోస్టర్ లో D షేప్ లో ఉన్న కత్తిని చూపించారు. ఈ గ్లింప్స్ కోసం అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాపై మొదటి నుంచి ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ గ్లింప్స్ అప్డేట్ తో ఫ్యాన్స్.. రికార్డులు బద్దలుకొట్టడానికి రెడీగా ఉండండిరా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ గ్లింప్స్ లో కొరటాల.. ఎన్టీఆర్ ను ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో చూడాలి.
The Lord of Fear is coming in 3 days 🌊🌊🌊#DevaraGlimpse storming from Jan 8th. #Devara pic.twitter.com/uiQv3pdzO2
— Devara (@DevaraMovie) January 5, 2024
