Devara 7 days Collection Worldwide: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకి ముందు పాజిటివ్ వచ్చింది తరువాత మిక్స్ టాక్ వచ్చింది. అయితే ఫైనల్ గా కలెక్షన్స్ మాత్రం భిన్నంగా బయటకు వస్తున్నాయి. ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధిస్తున్నట్లు సినిమా యూనిట్ రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తోంది. అయితే టాలీవుడ్ ట్రాకింగ్ వెబ్సైట్స్ ఒక నెంబర్లు రిలీజ్ చేస్తుంటే సినిమా నిర్మాణ సంస్థ మాత్రం అందుకు భిన్నంగా కౌంటర్ రిలీజ్ చేస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగింది.
Toilet Tax: హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘‘టాయిలెట్ ట్యాక్స్’’ గందరగోళం..
అయితే వాళ్లందరి నోరులు మూయించే విధంగా తాజా కలెక్షన్స్ పోస్టర్ బయటకు వచ్చింది. నిన్న 6 రోజులకు గాను 396 కోట్లు కలెక్ట్ చేసినట్లు ప్రకటించారు. అయితే ఈరోజు ఏడు రోజులకు గాను 45 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్లు ప్రకటించారు అంటే ఒక రోజులో కేవలం 9 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్లు ప్రకటించారు. అంటే ఇప్పటివరకు సెలవుల వలన కాస్త కలెక్షన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయని ఇప్పుడు కాస్త తగ్గి ఉండవచ్చు అని యూనిట్ చెప్పే ప్రయత్నం చేసినట్టు ఇప్పుడు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక నిన్న సాయంత్రం పార్క్ హయత్ లో ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ తో పాటు డిస్ట్రిబ్యూటర్లకు మిక్కిలినేని సుధాకర్, నాగ వంశీ కలిసి పార్టీ ఇచ్చారు..