Site icon NTV Telugu

CSK VS DC : అదరగొట్టిన కేఎల్ రాహుల్.. చెన్నై టార్గెట్ 184

Csk Vs Dc

Csk Vs Dc

CSK VS DC : ఐపీఎల్ సీజన్-18లో భాగంగా చెన్నై తో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నేడు జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ముందుగా బ్యాటింగ్ ముగిసింది. కేఎల్ రాహుల్, అభిషేక్ బ్యాట్ ఝులిపించడంతో 20 ఓవర్లలో ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయి 183 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 3 సిక్స్ లు, 6 ఫోర్లతో 77 రన్స్ చేశాడు. అటు అభిషేక్ పోరెల్ రాహుల్ కు జత కలిశాడు. అతను కూడా 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టి 33 పరుగులు సాధించాడు. అక్షర్ పటేల్ 21, సమీర్ రిజ్వీ 20 పరుగులతో ఆకట్టుకున్నారు. ఇక చివర్లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ 22 రన్స్ చేయడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేయగలిగింది.

Read Also : SRH : పెద్దమ్మతల్లి గెలిపించమ్మా.. పూజలు చేసిన SRH ప్లేయర్లు

అటు చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్‌ 2 వికెట్లు తీశాడు. నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా, మతిశా పతిరనా తలా ఒక వికెట్ తీయడంతో ఢిల్లీని కట్టడి చేయగలిగారు. హాఫ్‌ ఇన్నింగ్స్ లోనే ఢిల్లీ మంచి స్కోర్ చేసింది. తర్వాత పది ఓవర్లలో రన్ రేట్ తగ్గిపోయింది. కేఎల్ రాహుల్ 17వ ఓవర్ లో ఔట్ అయ్యాడు. ఒకవేళ రాహుల్ గ్రౌండ్ లో ఉంటే మరింత స్కోర్ పెరిగేది. అశుతోష్ శర్మ కేవలం ఒక రన్ మాత్రమే చేసి నిరాశ పరిచాడు. ఈ సారి మిడిల్ ఆర్డర్ బాగానే ఆడింది. చెన్నైకి లక్ష్య చేధనలో మాస్టర్ గా పేరుంది. కాబట్టి ఈ 184 రన్స్ ను కూడా ఛేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెన్నై గురించి తెలిసిన ఢిల్లీ.. ఎక్కువ రన్స్ చేయాలని చూసినా.. చివరకు గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది.

Exit mobile version