NTV Telugu Site icon

Deepti Bhatnagar: అక్కా.. ఎవరే అతగాడు అని పాడిన పాపనేనా.. ఈమె.. ఇలా మారిపోయిందేంటి

Deepthi

Deepthi

Deepti Bhatnagar: అందానికే అందం ఆ రూపం.. యువకుల కలల రాణి. సన్నని నడుము.. ఆ నడుముకు తాళాల గుత్తి.. ఇలా చెప్పగానే.. హా మాకు తెలుసు .. మాకు తెలుసు ఆమె ఎవరో అని అంటారు.. అవును మీరు అనుకున్న హీరోయినే.. పెళ్లి సందడి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆ ముద్దుగుమ్మనే దీప్తి భట్నాగర్. నవ మన్మథుడా.. అతి సుందరుడా.. నిను వలచిన ఆ ఘనుడు.. అక్కా ఎవరే అతగాడు.. అంటూ రవళిని ఆటపట్టించినా.. హృదయమనే కోవెల తలుపులు తెరిచే తీరం ప్రేమ.. ప్రేమ అంటూ ప్రేమించిన వాడిని అక్కకోసం త్యాగం చేసినా ఆమెకే చెల్లింది. ఈ ఒక్క సినిమాతో దీప్తి దశ తిరిగిపోయింది. ఇప్పటికీ నడుము.. తాళాల గుత్తి.. స్వప్న సుందరి అనగానే దీప్తినే గుర్తుకొస్తుంది అని చెప్పడంలోఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా తరువాత ఆటో డ్రైవర్,సుల్తాన్.. మా అన్నయ్య..కొండవీటి సింహాసనం లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

Kriti Sanon: అతను నాతో అసభ్యంగా ప్రవర్తించి, అవమానించాడు.. సీత షాకింగ్ కామెంట్స్

అనంతరం కోలీవుడ్ లో సైతం మంచి సినిమాల్లో కనిపించిన ఈ చిన్నది కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ దర్శకుడు రణదీప్ ఆర్యని పెళ్లి చేసుకుని కుటుంబ బాధ్యతలు అందుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఇక ఇప్పుడిప్పుడే దీప్తి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతుంది. నిత్యం సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా ఆమె కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం దీప్తి గోవా ట్రిప్ లో ఎంజాయ్ చేస్తోంది. అప్పటికి, ఇప్పటికి ఆమెలో చాలా మార్పు వచ్చింది. బుగ్గలు వచ్చి కొద్దిగా బరువు పెరిగింది. సడెన్ గా చూస్తే ఆమె ఈమేనా అనే అనుమానం కలుగక మానదు. కానీ 56 వయస్సులో ఈ చిన్నది ఆ రేంజ్ లో మెయింటైన్ చేస్తుంది అంటే మాములు విషయం కాదని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments