Site icon NTV Telugu

తనీష్‌తో రిలేషన్… శ్రీరెడ్డి వ్యాఖ్యలపై దీప్తి సునైనా రియాక్షన్

Deepthi

దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్, సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారందరికీ ఆమె సుపరిచితమే. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీలలో ఆమె ఒకరు. ముఖ్యంగా షణ్ముఖ్ తో ప్రేమాయణం గురించి తరచూ వార్తల్లో నిలుస్తోంది. “బిగ్ బాస్ తెలుగు 5” రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ నుండి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటి నుండి దీప్తి సునైనా మళ్ళీ వార్తల్లో నిలిచింది. వీరిద్దరి ప్రేమాయణం ఇప్పుడు పెటాకులు కాగా… తాజాగా శ్రీరెడ్డి ఇచ్చిన కౌంటర్ కు దీప్తి ఇచ్చిన రియాక్షన్ ఆసక్తికరంగా మారింది.

Read Also : కథక్ మాస్ట్రో పండిట్ బిర్జూ మహారాజ్ ఇక లేరు

కొన్ని రోజుల క్రితం అంటే దీప్తి తన బ్రేకప్ విషయాన్ని ప్రకటించగానే, వివాదాస్పద నటి శ్రీరెడ్డి “బిగ్ బాస్ తెలుగు సీజన్ 2″లో పాల్గొన్నప్పుడు తనీష్‌తో దీప్తి చేసింది ఏంటి? అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా దీప్తి సునైనా ఆమె వ్యాఖ్యలపై స్పందిస్తూ “నేను బిగ్ బాస్ తెలుగు 2లోకి ప్రవేశించినప్పుడు నాకు 20 ఏళ్లు. నేను షోలో పాల్గొన్నప్పుడు చిన్నదాన్ని. నిజంగా దాని గురించి లేదా సంబంధం గురించి నాకు ఎటువంటి క్లారిటీ లేదు. కానీ ఆ షో ద్వారా నేను చాలా నేర్చుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ‘బిగ్ బాస్-5″ హౌజ్ లో షన్ను, సిరి మధ్య జరిగిన విషయాలకు బయట ఉన్న దీప్తి గట్టిగానే హర్ట్ అయ్యింది.

Exit mobile version