NTV Telugu Site icon

Deepthi Sunaina: షన్నుతో బ్రేకప్.. నటుడు విశాల్‌తో ప్రేమలో దీప్తి సునైనా.. ?

Deepthi Sunaina

Deepthi Sunaina

Deepthi Sunaina Love Song Reel with VJ Vishal Goes Viral in Social Media: డబ్స్ మాష్ లు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుని తరువాత యూట్యూబ్‌లో పలు వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ సాంగ్ చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది నటి దీప్తి సునైనా. కొన్ని సినిమాల్లో ముందు హీరోయిన్ గా నటించిన వారి కంటే ఎక్కువమంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. అలా వచ్చిన క్రేజ్ తో తెలుగు రియాలిటీ బిగ్‌బాస్ షోకు కంటెస్టెంట్‌గా వెళ్లి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అక్కడ చేసింది ఏమీ లేదు కానీ తనీష్ తో ప్రేమాయణం హాట్ టాపిక్ అయింది. అయితే అది పట్టాలు ఎక్కలేదు కానీ షణ్ముఖ్‌ని ప్రేమించి దాన్ని బహిర్గతం చేసి మరింత ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేస్తున్నారు ఇద్దరూ. లోపల జరిగిన దరిద్రాలు చూడలేక విభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరు ఎవరి లైఫ్ వారు చూసుకుంటూ ఉన్నా దీప్తి సునైనా ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటోంది.

Anchor Suma: ఆ సీన్ చూసి ఏడ్చేశాను.. హిట్ సినిమాకి సుమ రివ్యూ వైరల్!

కొద్దిరోజుల క్రితం ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది, చీర కట్టుకొని అందంగా ఫొటోలు షేర్ చేస్తూ ..‘‘నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా’’ అనే క్యాప్షన్ పెట్టడంతో ఆమె ప్రేమలో పడింది అంటూ ప్రచారం మొదలైంది. ఆ పోస్ట్ చూసిన వారంతా దీప్తి సునైనా మళ్ళీ ప్రేమలో పడింది కావొచ్చని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్లకి మరింత ఊతం ఇచ్చేలా ఆమెతో కలిసి ఒక వీడియో పోస్ట్ చేశారు తమిళ నటుడు విశాల్. విశాల్ అంటే విశాల్ రెడ్డి కాదు అలా అని విష్ణు విశాల్ కూడా కాదు. ఈ విశాల్ ఒక వీజే, ఒక ఛానల్ లో పని చేస్తూనే భాగ్యలక్ష్మి అనే తమిళ్ సీరియల్ చేస్తున్నాడు. అతనితో కలిసి ఈ భామ ఒక కవర్ సాంగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి రీల్స్ కూడా చేసినట్టున్నారు. అందులో ఒకటి క్లోజ్ గా ఉన్న లవ్ సాంగ్ రీల్ వదలడంతో ఆమెకు అభిమానులు కంగ్రాట్స్ చెబుతూ పెళ్ళెప్పుడు అని కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. అయితే అది రీల్ కోసమే చేసి ఉండచ్చని కొందరు కామెంట్ చేస్తున్నారు.