NTV Telugu Site icon

Deepika Padukone: ఫ్రెండ్ షిప్ అంటే దీపికాదే.. షారుఖ్ కోసం ఆ పని చేసి..?

Deepika

Deepika

Deepika Padukone: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ఇండియా సినిమాగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ను అందుకొని భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ముఖ్యంగా షారుఖ్ స్క్రీన్ ప్రజెన్స్.. అట్లీ ఇచ్చిన ఎలివేషన్స్.. ఆ ఎలివేషన్స్ కు అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. జవాన్ లాంటి సినిమాలు సౌత్ కు కొత్తేమి కాదు.. కానీ, నార్త్ వారికి ఇలాంటివి కొత్త .. అందుకే అటు సైట్ ఈ సినిమా అత్యధిక కలక్షన్స్ తో దూసుకెళ్లిపోతుంది. ఇక ఈ చిత్రంలో క్యామియోలో సంజయ్ దత్, దీపికా పదుకొనే కనిపించారు. సాధారణంగా ఎంత మంచి స్నేహం ఉన్నా కూడా ఎవ్వరు.. ఫ్రీ గా చేయరు.. జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయే సీన్ ఉన్నా కూడా అందుకు ఎంతో కొంత పారితోషికం అయితే తీసుకుంటారు. కానీ, స్నేహం కోసం.. డబ్బు తీసుకోకుండా నటించేవారు చాలా తక్కువమంది ఉంటారు.

Vijay Antony: ఏఆర్ రెహమాన్ వివాదం.. యూట్యూబ్ ఛానెల్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన బిచ్చగాడు

గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ క్యామియోగా చేశాడు.. చిరు, చరణ్ తో ఉన్న స్నేహం తో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. విక్రమ్ లో సూర్య రోలెక్స్ గా కనిపించి మెప్పించాడు. కమల్ హాసన్ మీద ఉన్న గౌరవం.. లోకేష్ తో ఉన్న స్నేహంతో రెమ్యూనిరేషన్ తీసుకోలేదు. ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి అందాల భామ దీపికా పదుకొనే కూడా చేరింది. షారుఖ్- దీపికా మధ్య ఎంత మంచి స్నేహం ఉందో అందరికీ తెల్సిందే. షారుఖ్ సరసన నటించి ఆమె ఎన్నో మంచి హిట్స్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక ఆ స్నేహంతోనే జవాన్ లో ఆమె నటించిన పాత్రకు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఫ్రెండ్ షిప్ అంటే దీపికాదే అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.