దీపికా పదుకొణె ‘గెహ్రైయాన్’ అనే సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ క్రమంలో నిన్న సినిమా నుంచి “దూబే” అనే మొదటి వీడియో సాంగ్ విడుదలైంది. దీపికా ఈ వీడియో సాంగ్ లో పలు లవ్ మేకింగ్ సీన్స్‌లో మునిగి తేలుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె చేసిన బోల్డ్ సన్నివేశాలు చాలామందికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి.
Read Also : “అల వైకుంఠపురములో” హిందీ వివాదం… హీరోపై నిర్మాత ఫైర్
ఇంకేముంది సోషల్ మీడియా మొత్తం దీపికాపై నెగెటివ్ కామెంట్లతో నిండిపోయింది. పెళ్లయిన మహిళ అయినప్పటికీ ఆమె ఇలాంటి బోల్డ్ సన్నివేశాలను చేయడం ఏమిటంటూ చాలా మంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీపిక ఇంతకుముందు కూడా బోల్డ్ సన్నివేశాలు చేసింది. కానీ ఈ చిత్రంలో ఆమె చేసిన నెక్స్ట్ లెవెల్ రొమాన్స్ అందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. కానీ దీపికా మాత్రం ట్రోల్స్‌కు భయపడకుండా సినిమాని ప్రమోట్ చేస్తూ ఆనందంగా ఉంది. శకున్ బాత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య పాండే మరో కథానాయికగా నటిస్తోంది. ఇక మరోవైపు దీపికా అభిమానులు కూడా ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు. అదే పెళ్ళైన రణ్వీర్ సింగ్ ఇలాంటి సీన్లలో కనిపిస్తే ప్రశ్నిస్తారా ? అంటూ దీపికాకు ఫుల్ సపోర్ట్ అందిస్తున్నారు.
