Site icon NTV Telugu

Deepika Padukone : హిజాబ్ ధరించిన దీపిక.. ఓ రేంజ్ లో ట్రోల్స్..

Ranveer

Ranveer

Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె మళ్లీ వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఆమె తన భర్త రణ్‌ వీర్ సింగ్ తో కలిసి ఎక్స్‌పీరియన్స్ అబుదాబి యాడ్ లో నటించింది. ఇందులో ఆమె హిజాజ్ ధరించింది. ఈ ప్రమోషనల్ యాడ్ లో ఇద్దరూ ఓ మ్యూజియంలో ఉంటారు. అక్కడ ఇద్దరూ కలిసి అబుదాబిని ప్రపంచంలోనే అత్యంత మేటి ప్రదేశం అన్నట్టు ప్రమోట్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ యాడ్ లో ఆమె హిజాబ్ ధరించడం పెద్ద వివాదంగా మారిపోయింది. హిందూ అమ్మాయి అయి ఉండి డబ్బుల కోసం హిజాబ్ ధరిస్తావా అంటూ నెటిజన్లు ట్రోల్స్ మొదలెట్టారు. కావాలంటే నార్మల్ బట్టల్లోనే ప్రమోట్ చేసుకోవచ్చు కదా అంటున్నారు.

Read Also : WAR -2 : వార్ -2 ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన

అలా కాకుండా హిజాబ్ వేసుకుని ధరించి మరీ అక్కడి ప్రదేశాల గురించి మాట్లాడటం అంటే.. డబ్బుల కోసం ఏమైనా చేసేస్తా అని చెబుతున్నావా అంటూ ఏకిపారేస్తున్నారు. దీంతో దీపిక పేరు సోషల్ మీడియాలో మళ్లీ వివాదంగా మారింది. మొన్నటికి మొన్న ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ సినిమాతో పాటు కల్కి-2 నుంచి ఆమెను తీసేశారు. ఆమె పెట్టే కండీషన్లు భరించలేకనే ఇలా తీసేస్తున్నట్టు తెలిపారు. దీంతో ఆమె పేరు తీవ్ర వివాదంగా మారింది. ఇప్పుడు మళ్లీ ఈ విషయంలో ఇలా జరుగుతోంది. అయితే దీపిక ఫ్యాన్స్ మాత్రం ఇందుకు కౌంటర్ ఇస్తున్నారు. ఆమె గతంలో హిందూ ఆలయాలకు ఎలా వెళ్లిందో బయట పెడుతూ ఆ ఫొటోలను రిలీజ్ చేస్తున్నారు. ఆమె హిందూ సంప్రదాయాలను పాటించే అమ్మాయి అంటున్నారు.

Read Also : Singer Rajvir Jawanda: పంజాబ్ గాయకుడు రాజ్‌వీర్ జవాండా కన్నుమూత

Exit mobile version