Site icon NTV Telugu

Deepika Padukone: ఇండియాలో ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్ గా ఎంపికైనా దీపికా

Deepika Padukune

Deepika Padukune

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఆమె ఇండియాలో ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా ఎంపికై, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ముందున్నారు. దీపిక భర్త రణ్‌వీర్ సింగ్ కూడా గర్వంగా ఉన్నట్టు ఒక ఇంట్రెస్టింగ్ పోస్టు ద్వారా తెలిపారు.

Also Read : SSMB29 : జక్కన్న కొత్త స్కెచ్‌.. ప్రియాంక చోప్రాకు మహేశ్ కంటే ఎక్కువ ప్రాధాన్యతా?

గత కొద్ది రోజులుగా సినిమాల వర్క్ లైఫ్, రెమ్యునరేషన్, షూటింగ్ షెడ్యూల్ విషయంలో కొన్ని చర్చల్లో భాగంగా “Spirit” మరియు “Kalki 2” సినిమాల నుంచి ఆమె బయటపడిన సంగతి తెలిసిందే. అయినా, తన నిర్ణయంపై స్థిరంగా నిలుస్తూ, సోషల్ మీడియాలో సపోర్టివ్ పోస్టులు షేర్ చేస్తున్నారు.

ఈ ఏడాది అక్టోబర్ 10న జరగిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (World Mental Health Day) సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొత్త ఇనిషియేటివ్‌ని తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా మెంటల్ హెల్త్ కేర్ అందరికీ అందేలా చేస్తూ, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా, దీపిక భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా ఎంపిక అయ్యారు. ఆమె ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశమై, మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా పనిచేయడానికి ఆసక్తి చూపించారు. దీపిక తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో మంత్రితో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేసి, ఈ గౌరవాన్ని అభిమానులతో పంచుకున్నారు.

Exit mobile version