బాలీవుడ్ టాప్ జంట దీపికా–రణవీర్ 2018లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఈ జంటకు 2024 సెప్టెంబర్ 8న కుమార్తె జన్మించింది. గత దీపావళి సందర్భంగా తమ బేబీని ప్రపంచానికి పరిచయం చేసి, ఆమెకు ‘దువా’ అని పేరు పెట్టారు. ‘దువా అంటే ప్రార్థన. ఎందుకంటే ఆమె మా ప్రార్థనలకు సమాధానం’ అంటూ తల్లిదండ్రులిద్దరూ అప్పట్లో ఎమోషనల్‌గా పంచుకున్నారు. అయితే తాజాగా దువా మొదటి పుట్టినరోజు సెప్టెంబర్ 9న ఎంతో ప్రత్యేకంగా జరిపారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ పిల్లల బర్త్‌డేలను గ్రాండ్‌గా, పెద్ద పార్టీలు పెట్టి సెలబ్రేట్ చేస్తారు. కానీ దీపిక మాత్రం తన స్టైల్‌కి తగ్గట్టుగా ఎంతో సింపుల్‌గానూ, మధురమైన జ్ఞాపకాలతో నిండిపోయేలా వేడుక జరిపింది. ఈ సందర్భంగా తల్లి దీపిక స్వయంగా కేక్ తయారు చేశారు.
Also Read : Kalyani Priyadarshan : ఫీమేల్ సూపర్ హీరో అని పిలుస్తుంటే గర్వంగా ఉంది..
‘నా ప్రేమ భాష? నా కుమార్తె 1వ పుట్టినరోజు కోసం కేక్ చేయడం!’ అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ రాసి, చాక్లెట్ కేక్ ఫోటోను పంచుకున్నారు. ఈ పోస్ట్ కేవలం రెండు గంటల్లోనే 5 లక్షలకు పైగా లైక్స్ సాధించింది. దీపికా పోస్టుపై సినీ ప్రముఖులు కూడా స్పందించారు. బిపాషా బసు, కాజల్ అగర్వాల్, భూమి పడ్నేకర్ వంటి నటి–నటులు దువాకు బర్త్‌డే విషెస్ చెప్పారు. ఫ్యాన్స్ అయితే ‘స్వీట్ మామ్ నుండి స్వీట్ బేబీకి స్వీట్ కేక్’, ‘ఓ మై గాడ్, దీపిక మీరు స్వయంగా కేక్ చేసారా!’, ‘దువాకు హ్యాపీ బర్త్‌డే, మీరు బెస్ట్ మమ్మీ’ అంటూ కామెంట్లు పెట్టారు. ప్రజంట్ ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
