Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepika Padukone: సినీ పరిశ్రమలో పని గంటలపై చర్చ గత కొన్ని వారాలుగా హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తల్లైన తర్వాత కూడా నటీమణులు గంటల తరబడి షూటింగ్లలో పాల్గొనాల్సి రావడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్ ఎనిమిది గంటల పనిదినాన్ని తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు మద్దతుగా పలువురు ప్రముఖులు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నిర్మాత, జర్నలిస్ట్ ఇంద్రజిత్ లంకేష్ కూడా దీపిక అభిప్రాయాన్ని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పని గంటల విషయంలో నటీనటులు, ముఖ్యంగా తల్లుల కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు అవసరమని ఇంద్రజిత్ లంకేష్ అభిప్రాయపడ్డారు. సాధారణ ఉద్యోగులతో పోలిస్తే నటీనటులపై శారీరక, మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. ఒక నటుడు, నటి గంటల తరబడి కెమెరా ముందే ఉండాల్సి వస్తుందని, అలసట వారి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందని వివరించారు. అందుకే షూటింగ్ షెడ్యూల్‌ను నటీనటుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయాలని సూచించారు.
Also Read
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
దీపికా పడుకోన్ వంటి తల్లులకు మరింత సౌకర్యవంతమైన పని గంటలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. చిన్న పిల్లల సంరక్షణలో తల్లి పాత్రను ఎవరూ భర్తీ చేయలేరని, కేర్టేకర్లు ఉన్నా తల్లి ప్రేమకు ప్రత్యామ్నాయం ఉండదని వ్యాఖ్యానించారు. అందుకే షూటింగ్ సమయాలను కుటుంబ బాధ్యతలకు అనుగుణంగా రూపొందించడం చిత్రబృందాల బాధ్యత అని చెప్పారు.
దీపిక తెరపైకి తీసుకొచ్చిన ఎనిమిది గంటల పని అనేది మొత్తం సినీ పరిశ్రమలోని మహిళా కళాకారులందరికీ ఉపయోగపడే అంశమని ఇంద్రజిత్ లంకేష్ అభిప్రాయపడ్డారు. ఎక్కువ గంటలు పనిచేస్తే తెరపై అలసట స్పష్టంగా కనిపిస్తుందని, చివరికి ప్రేక్షకుల విమర్శలను ఎదుర్కోవాల్సింది నటీనటులేనని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు కెమెరా వెనుక ఉంటారని, కానీ తెరపై కనిపించేది నటులేనని గుర్తుచేశారు.
అంతేకాదు, కార్పొరేట్ ఉద్యోగాలతో పోలిస్తే నటన మరింత శ్రమతో కూడుకున్నదని కూడా ఆయన వివరించారు. ఆఫీసుల్లో ఉద్యోగులు కూర్చుని పని చేయడంతో పాటు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుందని, కానీ షూటింగ్లో ప్రతి క్షణం శారీరక శ్రమ అవసరమవుతుందని చెప్పారు. ఈ కారణంగా నటులకు ఆరు నుంచి ఏడు గంటల పని సమయం సరిపోతుందని, ఎనిమిది గంటలు కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కువ కావచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దీపికా పడుకోన్ మొదలుపెట్టిన ఈ చర్చకు సినీ పరిశ్రమలో మరింత మంది ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. భవిష్యత్తులో ఈ చర్చ సినీ పరిశ్రమలో పని విధానాలపై ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాల్సి ఉంది.
- Tags
- Bollywood News
- cinema
తాజావార్తలు
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!