NTV Telugu Site icon

Deepika Padukone: అయ్యో.. దీపికా పదుకొణే.. ఫ్యాన్స్ ఆవేదన!

Deepika

Deepika

Deepika Padukone: ‘మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ ఇన్ ద వరల్డ్’ అంటూ ఉమెన్స్ డే సందర్భంగా ఓ సర్వే పదిమంది అందగత్తెలను జనం ముందు నిలిపింది. ఇంతకూ ఈ సర్వేలో అనుసరించిన విధానంబెట్టిదయ్యా అంటే – ఈజిప్షియన్ ప్రపోర్షన్స్ తో లెక్కలు వేశారట! అని “గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ రిపోర్ట్” పేర్కొంది. సరే.. ఒక్కో సంస్థ ఒక్కోలా తమ నియమనిబంధనల ప్రకారం ఎత్తులు, కొలతలు, ప్రవర్తన వగైరా చూసి అందగత్తెలను నిర్ణయిస్తూ ఉంటుంది. ఈ రిపోర్ట్ లో మాత్రం 29 ఏళ్ళ జోడీ కమర్ నంబర్ వన్ స్థానం ఆక్రమించింది. ఎందుకలాగా? ఈ రిపోర్ట్ లెక్కల ప్రకారం జోడీ కమర్ ముఖంలో 94.52 శాతం ఈజిప్షియన్ లుక్స్ ఉన్నాయట! “ద ఫ్రీ గై, హెల్ప్ , ద వైట్ ప్రిన్సెస్, కిల్లింగ్ ఈవ్, డాక్టర్ ఫాస్టర్” వంటి చిత్రాలలో నటించిన జోడీ కమర్ బ్రిటిష్ అకాడమీ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డు వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు సొంతం చేసుకుంది.దాంతో జోడీ కమర్ నంబర్ వన్ సుందరి అనడంలో ఎవరూ ఏ లాంటి సందేహాలు వ్యక్తం చేయడం లేదు.

Arnold Schwarzenegger: ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్ ఇప్పుడు కోరుకుంటున్నదేంటి!?

ఆమె తరువాతి స్థానంలో “ద గ్రేటెస్ట్ షో మేన్, డ్యూన్, మాల్కమ్ అండ్ మారీ, స్పైడర్ మేన్: హోమ్ కమింగ్” చిత్రాల నాయిక జెండాయా నిలచింది.ఈమె ముఖం 94.37 శాతం సాధించింది. 94.35 శాతంతో బెల్లా హాడిడ్, 92.44 శాతంతో బెయోన్స్, 91.81 శాతంతో అరియానా గ్రాండే తమ ముఖసౌందర్యంతో ఈజిప్షియన్ కొలతలకు అనువుగా నిలిచారు. ఆరో స్థానంలో టేలర్ స్విఫ్ట్ (91.64 శాతం), ఏడో స్థానంలో జోర్డాన్ డన్ (91.39), ఎనిమిదో స్థానంలో కిమ్ కర్దాషిన్ (91.28 శాతం), పదో స్థానంలో హొయియోన్ జంగ్ (89.63 శాతం) ఉన్నారు.

Writer Padmabhushan: ‘రైటర్ పద్మభూషణ్’ అప్పుడే ఇంట్లో అడుగుపెడతాడట

మన దీపికా పదుకొణే 91.22 శాతం పోలికలతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇదే ఆమె అభిమానులకు ఆవేదన కలిగిస్తోంది. నిజానికి నంబర్ వన్ స్థానం దక్కించుకున్న జోడీ కమర్ కంటే ఏ రీతిన చూసుకున్నా దీపికా పదుకొణే అందమే అధికంగా బంధాలు వేస్తుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. కావాలంటే ఈ మధ్య విడుదలయిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’లో పాటలు చూస్తే దీపిక అందంలోని అయస్కాంతం ఏ పాటిదో అర్థమవుతుందనీ వారి మాట! ఏది ఏమైనా ఉమెన్స్ డే సందర్భంగా విడుదల చేసిన ‘మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ ఇన్ ద వరల్డ్’లో మన దీపిక సైతం స్థానం సంపాదించడంపై ఎంతోమంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈజిప్షియన్ కొలతలతో ఈ సర్వే నిర్వహించిన ఇదే సంస్థ ‘భారతదేశంలో అతిలోక సుందరీమణులు’ పేరుతో మరో పరిశీలన సాగించనుంది. మరి అప్పుడు దీపికకు ఏ స్థానం లభిస్తుందో? అభిమానులు అప్పుడేమంటారో చూద్దాం.

Show comments