Deepesh Bhan: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ హిందీ బుల్లితెర నటుడు, కమెడియన్ దీపేష్ బాన్ మృతి చెందాడు. శనివారం ఉదయం క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందినట్లు సభ్యులు తెలిపారు. ఇక దీపేష్ మరణ వార్త బాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. హిందీలో ‘భాబీ జీ ఘర్ పర్ హై’ సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న దీపేష్ కామెడీ కా కింగ్, కామెడీ క్లబ్, భూత్ వాలా వంటి షోల ద్వారా మెప్పించిన దీపేష్ పలు సినిమాల్లో కమెడియన్ గా కూడా కనిపించాడు.
41 ఏళ్ళ దీపేష్ హఠాన్మరణం అందరిని ఆవేదనకు గురిచేస్తోంది. ఇక దీపేష్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నటుడు మృతి పై బాలీవుడ్ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ కవితా కౌశిక్ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసింది. ” దీపేష్ ఎంతో మంచి వ్యక్తి.. చాలా ఫిట్ గా ఉంటాడు. పొగ తాగడు.. మద్యం ముట్టుకోడు. కానీ అలాంటి వ్యక్తికి ఇలా జరగడం ఎంతో బాధగా ఉంది. దీపేష్ నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యింది.
