Site icon NTV Telugu

DC Movies: సరికొత్త సూపర్ హీరోని ఇంట్రడ్యూస్ చేసిన DC

Dc Movies

Dc Movies

ప్రపంచంలో ఎన్నో కుల మతాలు ఉంటాయి కానీ సినిమా అభిమానులకి మాత్రం రెండు మతాలే ఉంటాయి. అందులో ఒకటి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అయితే మరొకటి డిస్నీ కామిక్స్ యూనివర్స్. మూవీ లవర్స్ ఈ రెండు మతాలుగా విడిపోయి సినిమాలు చూస్తూ ఉంటారు. మా యూనివర్స్ గొప్ప అంటే కాదు మా యూనివర్స్ మాత్రమే గ్రేట్ అంటూ తరచుగా డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు కొత్త హీరోలు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ లిస్టులో కొత్తగా చేరాడు ‘బ్లూ బీటిల్’. డిస్నీ కామిక్స్ నుంచి పుట్టిన ఈ సూపర్ హీరో బ్యాక్ స్టొరీ చూస్తే కాస్త మార్వెల్ సూపర్ హీరో స్పైడర్ మాన్ సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. స్పైడర్ కుట్టడం, అక్కడి నుంచి అతను స్టార్ హీరో అవ్వడం… ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, ఫ్రెండ్స్… ఇలా మనలాంటి ఒక రెగ్యులర్ మనిషి స్పైడర్ మాన్ అవుతాడు. దాదాపు ఇలాంటి కథే ‘బ్లూ బీటిల్’ది కూడా. రీసెంట్ గా కాలేజ్ గ్రాడ్యువేషన్ కంప్లీట్ చేసుకున్న జైమ్ రేయెస్, తన భవిష్యత్తు పైన ఎంతో హోప్ తో ఇంటికి తిరిగి వస్తాడు. అయితే అతను ఇంటి నుంచి వెళ్లినప్పుడు ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉందో అది తిరిగొచ్చిన తర్వాత జైమ్ రేయెస్ కి కనిపించదు. ఈ ప్రపంచంలో అసలు తన పర్పస్ ఏంటి అనేది కనుగొనడానికి జైమ్ రేయెస్ శోధిస్తున్నప్పుడు, జైమ్ ఊహించని విధంగా ‘ది స్కారాబ్‌’ అతని చేతికి చేరుతుంది.

ఇక్కడి నుంచి జైమ్ రేయెస్ కాస్త సూపర్ హీరో బ్లూ బీటిల్ గా మారాడు. ఆగస్ట్ 18న విడుదల కానున్న ఈ సూపర్ హీరో సినిమా ట్రైలర్ ని మేకర్స్ అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. జోలో టైటిల్ హీరో రోల్ ప్లే చేసిన ఈ మూవీని ఏంజెల్ సోటో డైరెక్ట్ చేశాడు. ట్రైలర్ అయితే ఇంటరెస్టింగ్ అండ్ గ్రాండ్ గా ఉంది. ఫన్, ఫ్యామిలీ, అడ్వెంచర్ సెటప్ లో డిజైన్ చేసిన ఏ సూపర్ హీరో క్యారెక్టర్ అయినా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. థార్, స్పైడర్ మాన్, ఐరన్ మాన్ పాత్రలే అందుకు ఉదాహారణ, ఇప్పుడు ఇవే ఎలిమెంట్స్ తో బ్లూ బీటిల్ వస్తున్నాడు. మరి ఆడియన్స్ ఈ సరికొత్త సూపర్ హీరోని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియాలి అంటే ఆగస్ట్ 18 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

Exit mobile version