DC Release Date: గ్యాంగ్‌స్టర్ గా లోకేష్ కనగరాజ్.. ‘డీసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Dc Release Date (2)

Dc Release Date (2)

DC Release Date: దర్శకుడిగా వరుస విజయాలతో దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్న తొలి చిత్రం ‘డీసీ’ (DC) విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న లోకేష్, నటుడిగా ఎలా ఆకట్టుకుంటారనే ఆసక్తి ఇప్పటికే అభిమానుల్లో నెలకొంది. ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటి వామికా గబ్బి కథానాయికగా నటిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. విడుదల తేదీ ప్రకటనతో పాటు చిత్రబృందం కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి కనిపించిన లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

చిత్రబృందం ప్రకటించిన వివరాల ప్రకారం, ‘డీసీ’ చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందిన ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతున్నట్లు ట్రైలర్ సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, ఇంటెన్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ కథ దేవదాస్, చంద్ర అనే రెండు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఈ రెండు పాత్రల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి చిత్రానికి ‘డీసీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కథలో ఈ ఇద్దరి మధ్య సాగే గ్యాంగ్‌ వార్ హైలెట్ గా నిలవనుంది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుంన్నారు. దర్శకుడిగా ఇప్పటికే భారీ అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న లోకేష్ కనగరాజ్, హీరోగా కూడా అదే స్థాయిలో మెప్పిస్తారా అనే ఆసక్తి ఇప్పుడు సినీ ప్రేక్షకుల్లో నెలకొంది. జూలై 31న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.