కెప్టెన్ అమెరికా, ఐరన్ మాన్, థార్… లాంటి సూపర్ హీరో క్యారెక్టర్స్ లో వరల్డ్ వైడ్ మంచి ఫాలోయింగ్ ఉంది. వీళ్ళందరికన్నా ముందే సూపర్బ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న సూపర్ హీరో ‘సూపర్ మాన్’. డిస్నీ కామిక్స్ వరల్డ్ నుంచి ప్రపంచానికి పరిచయం అయిన ఈ సూపర్ హీరోకి ఇండియాలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సూపర్ మాన్ సీరీస్ నుంచి ఏ సినిమా వచ్చినా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుంది. అమెరికా నుంచి ఇండియా వరకూ ప్రతి సెంటర్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టగల సూపర్ మాన్ సీరీస్ నుంచి ఇటివలే ‘సూపర్ మాన్ లెగసీ’ సినిమా అనౌన్స్ అయ్యింది. 1938 ఏప్రిల్ 18న సూపర్ మాన్ క్యారెక్టర్ మొదటిసారి ఆడియన్స్ ముందుకి వచ్చింది, ప్రతి ఏటా ఏప్రిల్ 18న సూపర్ మాన్ యానివర్సరీని ఫాన్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈసారి ఈ సెలబ్రేషన్స్ కి మరింత కిక్ ఇచ్చింది ‘సూపర్ మాన్ లెగసీ’ సినిమా. డిస్నీ కామిక్స్ ని ‘కో-సీఈఓ’గా బాధ్యతలు చేపట్టగానే ‘సూపర్ మాన్ లెగసీ’ సినిమాని అనౌన్స్ చేసిన జేమ్స్ గన్ తాజాగా ‘సూపర్ మాన్ లెగసీ’ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడు.
ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ “I’m honored to be a part of the legacy. And what better day than #SupermanAnniversary Day to dive fully into early pre-production on #SupermanLegacy? Costumes, production design, and more now up and running” అని జేమ్స్ గన్ ట్వీట్ చేశాడు. సూపర్ మాన్ యంగ్ గా ఉన్నపటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది కాబట్టి ఇందులో ‘హెన్రీ కావిళ్ల’ సూపర్ మాన్ గా కనిపించే అవకాశం లేదు. కొత్త హీరోతోనే సూపర్ మాన్ లెగసీని షూట్ చెయ్యాల్సి ఉంది. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మూడు వాల్యూమ్స్, సూసైడ్ స్క్వాడ్ లాంటి సినిమాలని చేసిన జేమ్స్ గన్ ‘సూపర్ మాన్ లెగసీ’ సినిమాని 2025 జూలై 11న విడుదల చెయ్యనున్నాడు. మరి హెన్రీ కావిళ్ళ లేకుండా సూపర్ మాన్ క్యారెక్టర్ ని ఆడియన్స్ ఎంతవరకూ యాక్సెప్ట్ చేస్తారు అనేది చూడాలి.
I’m honored to be a part of the legacy. And what better day than #SupermanAnniversary Day to dive fully into early pre-production on #SupermanLegacy? Costumes, production design, and more now up and running. pic.twitter.com/TJYpCRmdsf
— James Gunn (@JamesGunn) April 18, 2023
