మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్టు కనిపిస్తోంది. ప్రముఖ నటుడు, ‘మా’ వ్యవస్థాపక సభ్యుడు కృష్ణం రాజు నేతృత్వంలో వార్షిక జనరల్ బాడీ సమావేశం (ఏజిఎం) నిన్న జరిగింది. ఏజిఎం రూల్స్ ప్రకారం 21 రోజుల్లో ఎన్నికలు జరగాలి. ఈ సమావేశంలో “మా” అధ్యక్ష పదవికి ఎన్నికలను నిర్వహించడానికి పలువురు సభ్యులు 3 తేదీలను ప్రతిపాదించినట్టు సమాచారం. సెప్టెంబర్ 12, 19, 26 తేదీలను సభ్యులు ప్రతిపాదించారు. అయితే సెప్టెంబర్ 13 ఎన్నికలను నిర్వహించడం టూ ఎర్లీ అని, గణేష్ నిమజ్జనం కారణంగా సెప్టెంబర్ 29 తేదీని తోసి పుచ్చారు. దీంతో సెప్టెంబర్ 26న ఎన్నికలు నిర్వహించే విషయమై అసోసియేషన్ ఆలోచిస్తోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది.
Read Also : చిరు విషయంలో బండ్ల గణేష్ కొత్త డిమాండ్
వార్షిక జనరల్ బాడీ సమావేశం ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకూ జరిగింది. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో దాదాపు 160 మంది సభ్యులు పాల్గొన్నట్టు సమాచారం. ఈసారి సినీ పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులు “మా” అధ్యక్ష పదవి కోసం పోటీకి సిద్ధమయ్యారు. కొన్ని రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ పోటీ పడనున్నారు. దీనితో ఈసారి పోటీ ఉత్కంఠభరితంగా మారింది. ఇక ప్రకాష్ రాజ్‌కు మెగా ఫ్యామిలీ మద్దతు ఉండగా, మంచు విష్ణుకు సీనియర్ నటులు, నందమూరి కుటుంబ సభ్యుల మద్దతు ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో “మా” ఎన్నికల్లో గెలిచేది ప్రకాష్ రాజ్ అని, మెగా సపోర్ట్ ఉంది కాబట్టి వార్ వన్ సైడ్ అనేది ఓ వర్గం మాట.
