Site icon NTV Telugu

Dasara Trailer: బాంచత్.. ఇది నాని నట విశ్వరూపం

Nani

Nani

Dasara Trailer: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓడేల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దసరా. SLV సినిమాస్ సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా మార్చి 30 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రా అండ్ రస్టిక్ లుక్ లో నాని కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను పెట్టుకొనేలా చేసింది. ఇక తాజాగా రిలీజైన ట్రైలర్.. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసేలా చేస్తోంది అంటే అతిశయోక్తి కాదు. తరిలేరు ఆద్యంతం ఆకట్టుకోవడమే కాదు నాని నటించిన అంతకుముందు సినిమాలన్నీ ఒక ఎత్తు.. ఈ ఒక్క దసరా మరో ఎత్తు అని అనిపించేలా చేసింది.

Venkatesh: వెంకీమామ… నువ్వు కూడా ఇలాంటి పని చేస్తావనుకోలేదు…

ట్రైలర్ విషయానికొస్తే.. వెన్నెల వచ్చిందిరా.. ధరణిగా పెట్టి పుట్టావ్ రా నా కొడకా అంటూ నాని, కీర్తి సురేష్ ల డైలాగ్స్ తో ట్రైలర్ మొదలయ్యింది. బొగ్గు గనుల మధ్య రా అండ్ రస్టిక్ లుక్ లో ధరణిగా నాని ఎంట్రీ అదిరిపోయింది. తినడం, ఎవరినైనా కొట్టడం, తాగడం, పడుకోవడం.. ఇది ధరణి అలవాటు. అలా తాగి ఒక చేయరాని తప్పు ధరణి చేసినట్లు చూపించారు. దాని పర్యవసానంగా ధరణి, అతని స్నేహితులు చిక్కుల్లో పడడం.. ఆ తప్పును సరిద్దిదుకోవడానికి ధరణి కత్తి పట్టడం లాంటివి చూపించారు. అసలు ధరణి చేసిన తప్పు ఏంటి..? దాని ద్వారా నష్టపోయింది ఎవరు..? ఆ తప్పును ధరణి ఎలా సరిచేశాడు..? మధ్యలో వెన్నెల ఎవరు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా మొత్తానికి నాని హైలైట్ అని చెప్పాలి. అంటే మన భాషలో చెప్పాలంటే దసరా.. వన్ మ్యాన్ షో అన్నమాట. రా అండ్ రగ్గడ్ లుక్ లో ధరణిగా నాని.. తన విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ఇక నాని తరువాత క్రెడిట్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ కు చెందుతుందని చెప్పాలి. మొత్తానికి ట్రైలర్ తోనే అభిమానులకు అంచనాలు పెంచేశారు మేకర్స్. మరి నాని చూపించిన ఈ విశ్వరూపంకు ఎలాంటి అవార్డులు రివార్డులు వస్తాయో చూడాలి.

Exit mobile version