NTV Telugu Site icon

Dasara: ‘దసరా’ లో సిల్క్ స్మిత పోస్టర్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..?

Nani

Nani

Dasara:న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. నాని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం రేపు అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నాని రా అండ్ రస్టిక్ లుక్, కీర్తి సురేష్ డీ గ్లామరస్ రోల్ అనగానే నటనకు ఆస్కారం ఉండబోయే పాత్రలు అని తెలుస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. మొదటి నుంచి ఈ ప్రమోషన్స్ లో నాని ఒక్కడే కనిపించగా.. గత వారం నుంచి కీర్తి సురేష్, డైరెక్టర్ శ్రీకాంత్ కూడా పాలుపంచుకొని తమ అనుభవాలను చెప్పుకొచ్చారు. దసరా ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాని వెనుక సిల్క్ స్మిత పోస్టర్ ఉంటుంది. ఆ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు దసరాకు, సిల్క్ స్మితకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది అంతుచిక్కని ప్రశ్న. అయితే ఈ ప్రమోషన్స్ లో నానిని ఇదే ప్రశ్న అడిగితే.. సిల్క్ స్మిత వీరాభిమాని తాను కాదని, తన డైరెక్టర్ అని నోరు విప్పేశాడు.

RRR: ఈ ‘చిన్నికృష్ణుడి’కి ‘ట్రిపుల్ ఆర్’కు సంబంధమేంటి!?

ఇక ఈ విషయమై శ్రీకాంత్ మాట్లాడుతూ.. ” నా చిన్నప్పుడు మా తాత సింగరేణి గన్నులో పనిచేసేవాడు. అప్పుడు నేను ఆయనకు రోజు కల్లు తీసుకొని వెళ్ళేవాడిని. కల్లు దుకాణం వెళ్లిన సమయంలో అక్కడ మొదటి సారి సిల్క్ స్మిత పోస్టర్ ను చూశాను. ఆమె అప్పుడు హీరోయిన్ అని, సైడ్ క్యారెక్టర్స్ చేస్తుంది అనినాకు తెలియదు. ఆ ఫోటో చూసిన దగ్గరనుంచి నా మనసులో ఒక ముద్ర పడిపోయింది. అప్పటినుంచి నేను డైరెక్టర్ అయ్యేవరకు ఆమె ఫోటో అలాగే నా మనసులో ఉండిపోయింది. మా తాత తాగిన కల్లు దుకాణం జ్ఞాపకాలను సైతం.. దసరా సినిమాలో కూడా పెట్టా. అంతేకాకుండా సిల్క్ స్మిత కు సంబంధించిన కొన్ని సీన్స్ కూడా ఉంటాయి” అని చెప్పుకొచ్చాడు. సిల్క్ స్మిత పోస్టర్ వెనుక శ్రీకాంత్ డైరెక్టర్ గా మారిన కథ ఉంది అన్నమాట అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Show comments