Site icon NTV Telugu

Dasara Delete Scene: ఎందుకయ్యా.. ఇంత మంచి సీన్ ను తీసేశారు

Nani

Nani

Dasara Delete Scene: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. మర్చి 30 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రా అండ్ రస్టిక్ లుక్ లో నాని.. నటవిశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ఇక వెన్నెలగా కీర్తి డ్యాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కొత్త డైరెక్టర్ అయినప్పటికీ శ్రీకాంత్ మంచి డైరెక్టర్ అని నిరూపించుకున్నాడు. మంచి కలక్షన్లను సైతం అందుకున్న ఈ సినిమా ఇంకా థియేటర్ లో సందడి చేస్తూ ఉంది. ఇక ఈ సినిమాపై ఇంకా హైప్ పెంచడానికి ఈ చిత్రం నుంచి డిలీటెడ్ సీన్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నాని, కీర్తిని పెళ్లి చేసుకొని తీసుకెళ్లినప్పుడు ఆమె తల్లి కానీ, సూరి తల్లి కానీ ఎవ్వరు ఏమి మాట్లాడరు. కీర్తి సైతం నోరు మెదపకుండా వెళ్ళిపోతోంది. ఆ తరువాత కీర్తి, తన తల్లిపై కోపాన్ని ప్రదర్శించే సీన్ ను డిలీట్ చేశారు.

Natty Kumar: ఆస్కార్ గ్రహీతలకు సన్మానం.. అతను లేకుండా సిగ్గుచేటు

ఇప్పుడు ఆ సీన్ ను డీలిటెడ్ సీన్ గా రిలీజ్ చేశారు. ఒకరితో తాళి కట్టించుకొని, అతడు చనిపోయాక.. తాళి తీసే సమయంలో ఇంకొకరు వచ్చి తాళికట్టినప్పుడు ఒక అమ్మాయి పడే బాధను కీర్తి చూపించగా.. కూతురు బతుకు బద్నామ్ అయిపోయిందని, ఆమె జీవితం ఎటువెళ్తుందో దిక్కుతోచని స్థితిలో ఉందని తల్లి.. కూతురుకు సమాధానం చెప్పనప్పుడు.. ఆమె స్థానాన్ని తీసుకొని అత్త.. అమ్మలా కీర్తికి.. అన్ని మొగుడే అని చెప్పి అత్తారింటికి పంపిస్తుంది. ఈ సీన్ సినిమాలో ఉంటే ఇంకాస్త ఇంపాక్ట్ ఉండేది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఎందుకయ్యా.. ఈ సీన్ తీసేసారు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version