Dasara and Balagam are in Indias Oscar 2024 Official Entry Probables:’ఆర్ఆర్ఆర్’ సినిమా తెలుగు వారి ఆస్కార్ ఆశలను సజీవం చేసింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ గెలుపుతో భారత దేశం నుండి మంచి సినిమాలని పంపాలని మేకర్స్ ఉవ్విళ్లూరుతున్నారు. భారత దేశం నుండి అధికారికంగా సినిమాలను ఆస్కార్ కి పంపే ప్రక్రియ మొదలైందని తెలుస్తోంది. నిజానికి గత ఏడాది గుజరాతి సినిమా ‘చెల్లో’ని అధికారికంగా పంపగా దానికి అవార్డు రాలేదు. ఇక డాక్యుమెంటరీ విభాగంలో ‘ఎలిఫెంట్ విస్పర్స్’ అనే సినిమాకి వచ్చింది. అయితే 2024 సంవత్సరానికి గాను అంటే వచ్చే సంవత్సరానికి ఆస్కార్ కి ఏ సినిమా అధికారికంగా పంపాలి అనే విషయంలో ప్రక్రియ మొదలైన క్రమంలో గిరీష్ కాసరవెల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన కమిటీ చెన్నైలో పని మొదలెట్టిందని అంటున్నారు. ఇక ఈ క్రమంలో మొత్తం దేశ వ్యాప్తంగా 22 సినిమాలు వచ్చాయని తెలుస్తోంది.
Suriya: బోయమామతో సినిమా అంటే రక్త చరిత్ర 3 రాయిస్తాడేమో?
ఇక ఈ కేటగిరిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయని అంటున్నారు. అవేమంటే నాని హీరోగా నటించిన ‘దసరా’, అలాగే తెలంగాణ నేపథ్యం ఉన్న ‘బలగం’ అని అంటున్నారు. మరోపక్క హిందీ నుంచి, ‘ది స్టోరీ టెల్లర్’, ‘మ్యూజిక్ స్కూల్’, ‘మిస్ ఛటర్జీ వెర్సస్ నార్వే’, ’12th ఫెయిల్’ సినిమాలు ఉండగా ‘గదర్ 2’, ‘ఘుమర్’, ‘అబ్ తో సబ్ భగవాన్ భరోసే’, ‘రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని’లను కూడా లిస్టులో ఉంచారని అంటున్నారు. తమిళం నుండి ‘విడుదలై -1’, మరాఠీ నుండి ‘వాల్వి’, ‘బాప్ లాయక్’ సినిమాలు ఉన్నాయని జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సినిమాలను వీక్షించిన అనంతరం వీటిల్లో ఒక సినిమాను భారత్ తరపున అధికారికంగా ‘బెస్ట్ ఫారెన్ ఫిలిం’ కేటగిరిలో ఆస్కార్‌కు పంపుతారు. మరి చూడాలి వీటిలో ఫైనల్ గా అధికారిక ఎంట్రీ ఏ సినిమా దక్కించుకుంటుంది అనేది.