NTV Telugu Site icon

Nani: చమ్కీల అంగీలేసి.. ఓ వదినే.. చాకు లెక్క ఉండేటోడే..

Nani

Nani

Nani: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓడేల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దసరా. నాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఒకపక్క నాని వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లతో హోరెత్తిస్తుంటే.. ఇంకోపక్క మేకర్స్.. సినిమాలోని ఒక్కో సాంగ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ఆసక్తిపెంచుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా మారాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రానున్న మూడో సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.

Manchu Manoj: నేను చేసిందేం లేదు.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడంతే

చమ్కీల అంగీలేసి.. ఓ వదినే.. చాకు లెక్క ఉండేటోడే.. అంటూ ఈ సాంగ్ సాగనుంది. తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్న ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకొంటుంది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. రామ్ మిరియాల,ధీ కలిసి పాడారు. సాంగ్ లో నాని చమ్కీల అంగీ వేసుకొని వెనుక కీర్తిని కూర్చోపెట్టుకొని ఎక్కడికో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. నాని రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తుండగా.. కీర్తి సైతం ఎర్రచీర కట్టుకొని పల్లెటూరు అమ్మాయిల కనిపిస్తోంది. ఈ ఫుల్ సాంగ్ ను మార్చి 8 న రిలీజ్ చేయనున్నారు. ప్రోమో చూస్తుంటేనే చార్ట్ బస్టర్ లిస్ట్ లో నిలిచాలనే కనిపిస్తోంది. మరి సాంగ్ తో పాటు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ లిస్ట్ లో ఉంటుందో లేదో చూడాలి.

Show comments