NTV Telugu Site icon

Nani: భార్యా బాధితుడనని ఈ పాట రూపంలో చెప్పావా భయ్యా

Dasara

Dasara

Nani: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓడేల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. SLV సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొట్ట మొదటిసారి నాని.. రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. చమ్కీల అంగీలేసి.. ఓ వదినే.. చాకులా ఉండేటోడే అంటూ సాగిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అయితే ఎంతో ఫ్రెష్ గా అనిపిస్తోంది. సాంగ్ లో కీర్తి సురేష్, నాని మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకొంటుంది.

Khushboo Sunder: నా తండ్రి నీచుడు.. అందుకే సిగ్గులేకుండా చెప్పా

ఒక భర్త పెళ్ళికి ముందు ఉన్నట్లు పెళ్లి తరువాత లేడు అని భార్య తన ఆవేదనను చెప్పుకొస్తుండగా.. భార్య చేసే పనుల వలనే తాను మందుకుబానిస అయ్యినట్లు భర్త చెప్పుకొస్తున్నాడు. భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న అల్లరి పనులను ఈ పాట రూపంలో చూపించారు. పెళ్ళైన కొత్తలో ఉన్నవారు.. పెళ్లి తరువాత ఎలా ఉంటారు అనేది కాసర్లశ్యామ్ ఎంతో చక్కగా వర్ణించాడు. నిజం చెప్పాలంటే.. భార్యా బాధితుడును అని నాని చెప్పినట్లే ఉంది. ఇక ధీ, రామ్ మిరియాల తమ వాయిస్ తో సాంగ్ ను ఎక్కడికో తీసుకెళ్లారు. మొత్తానికి ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా మారుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Show comments