Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరో సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయ్యాడు. నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేసి విమర్శల పాలు అవుతూ ఉంటాడు. అమ్మాయిల గురించి, దేవతల గురించి, శృంగారం గురించి దర్శన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇక తాజాగా దర్శన్.. టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో ఇండియన్ సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి. ఆయన ఇండస్ట్రీకి దొరకడం ఎంతో అదృష్టమని ప్రతి ఇండస్ట్రీ గొప్పగా చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలో దర్శన్, రాజమౌళి గురించి మాట్లాడిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Kiran Abbavaram: అపరిచితుడుకు అమ్మ మొగుడులా తయారయ్యాడు
“టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి పేరెత్తగానే అందరూ ఆహా ఓహో అంటుంటారు.. ఆయనేమీ ఎక్స్ట్రార్డినరీ డైరెక్టర్ కాదు.. రాజమౌళి కేవలం ఒక దర్శకుడు మాత్రమే.. దానికెందుకు అంతగా అతడిని హైప్ చేస్తున్నారు” అని కామెంట్స్ చేశాడు. ఇక దీంతో నెటిజన్స్.. దర్శన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన సినిమాను విదేశాలకు తీసుకెళ్లి మన ఇండియన్ ఖ్యాతిని నిలబెట్టిన దర్శకుడిని ఇలాంటి మాటలు అనడం.. మీకు పద్ధతి కాదని చెప్పుకొస్తున్నారు. ఇంకోపక్క డైరెక్టర్ వెంకటేష్ మహా.. ప్రశాంత్ నీల్ ను అన్నందుకు.. రివెంజ్ గా దర్శన్, రాజమౌళిని అంటున్నాడని మరికొందరు అంటున్నారు.